"ఓడిపోయిన నా ప్రేమని గెలిపించుకోడానికి మళ్లీ పుడతా" .. "మగధీర" సీన్ రిపీట్
'ఓడిపోయిన నీ ప్రేమని గెలిపించుకోడానికి మళ్లీ పుడతావురా భైరవా' అంటూ మగధీర సినిమాలో షేర్ ఖాన్ పాత్రలో శ్రీహరి చెప్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఇక్కడ కూడా తన ప్రేయసి లేదన్న వార్త తెలిసిన ఆ యువకుడు బాధాతప్త హృదయంతో రాసిన లేఖను చూస్తే కూడా ఇలాగే గూస్ బంప్స్ వస్తాయి. ఈ ప్రేమజంట మరణం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలోని పాతకొమ్ము గూడెంలో జరిగింది. ఆ యువకుడు రాసిన మరణ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
నేటి యువత ప్రేమే సర్వస్వం.. ప్రేయసి లేదా ప్రియుడు లేకపోతే ఇంక బతకలేం అన్నట్లుగా మారిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. తమ ప్రేమ విఫలమైందన్న కారణంతో బంగారం లాంటి భవిష్యత్తును ముగించేసుకుంది ఆ జంట. కనిపెంచిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలోని పాతకొమ్ము గూడెంలో జరిగింది.

ప్రేయసి మరణవార్తను తట్టుకోలేక పోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజినీరింగ్ విద్యార్థిని అయిన హితవర్షిణి ప్రేమలో విఫలమైంది. దీంతో ఆమె సికింద్రాబాద్ లో రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. ఈ వార్త తెలిసిన ప్రియుడు వినయ్ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. " నా బంగారు తల్లి లేని లేకంలో నేను బతకలేను. మనల్ని ఎవరూ విడదీయలేరు. వచ్చే జన్మలో మళ్లీ పుట్టి పెళ్లి చేసుకుంటా" అని లెటర్ రాసిన వినయ్ బావిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications