గ్రేటర్‌లో మాకు 70 సీట్లు, ఇదిగో: కెటిఆర్, నాయిని నీలా కాదు: దానంపై హరీష్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు తమదేనని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడీపీ అసోసియేట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సర్వేలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలిందని కెటిఆర్ అందుకు సంబంధించిన వివరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లలో విడిపి అసోసియేట్స్ సర్వే నిర్వహించింది. ఆ సంస్థ తెలిపిన వివరాలను కెటిఆర్ ట్వీట్ చేశారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అది తెలిపింది. దాని ప్రకారం... గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ 70 డివిజన్లను గెలుచుకునే అవకాశాలున్నాయి.

తద్వారా మేయర్ పీఠం కైవసం చేసుకునే అవకాశముంది. పాతబస్తీలో పట్టున్న మజ్లిస్ పార్టీ 42 డివిజన్లలో, కాంగ్రెస్ 16 డివిజన్లలో, తెలుగుదేశం పార్టీ 11 డివిజన్లలో, బిజెపి 8 డివిజన్లలో, ఇతరులు మూడు డివిజన్లలో విజయం సాధిస్తారు.

TRS going all out to win Hyderabad Mayoral Election

కాంగ్రెస్‌పై హరీష్ రావు భగ్గు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టికెట్లు ఇస్తామన్నా పోటీచేసేవారు లేరని, ఆ పార్టీకి కనీసం రెండు సీట్లు కూడా దక్కవని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అసలు ఆ పార్టీకి నాయకుడే కరువయ్యాడన్నారు. ఆంధ్ర పార్టీ అయిన టీడీపీకి క్యాడర్ లేదని, బీజేపీకి ఓటర్లు లేరన్నారు.

తెలంగాణ భవన్‌లో ఆదివారం అంబర్‌పేట, ధూల్‌పేట, ఉప్పల్ ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. హైదరాబాద్ ఇప్పుడు టీఆర్‌ఎస్ వైపు చూస్తోందన్నారు.

ఒకప్పుడు ముంబైని నెవర్ స్లీప్ నగరం అనేవారని, కానీ ఇప్పుడు హైదరాబాద్‌ను నెవర్ స్లీప్ (సెకను కరెంటు పోకుండా) నగరంగా చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. రూ.5.30 లక్షలతో నిర్మించే డబుల్ బెడ్ రూం ఇండ్లు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శమన్నారు.

తాను రెండు రోజుల కిందట మధ్యప్రదేశ్ వెళ్లినపుడు అక్కడ ప్రభుత్వ పక్కా గృహాల గురించి వాకబు చేస్తే, ఒక దగ్గర రూ.75వేలు, మరో దగ్గర రూ.లక్షతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంతో పేదల ఇండ్లు సాకారం కావడం దేశానికే ఒక రోల్ మోడల్ అని కొనియాడారు.

కాంగ్రెస్ నేత దానం నాగేందర్ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై హరీశ్ రావు మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల పంచలూడగొట్టే పరిస్థితి వస్తుందన్నారు. నాయిని ఓ ఉద్యమ నాయకుడు అని, దానంలా పూటకో పార్టీ మార్చే నాయకుడు కాదని ఎద్దేవా చేశారు.

నాయిని తెలంగాణ సింహంమన్నారు. నైతిక విలువలకు కట్టుబడి ఉండి, పన్నెండేళ్లుగా కేసీఆర్ వెంట జైలుకు వెళ్లిన నాయకుడు నాయిని అని, దానం మాత్రం నిన్నటిదాకా టీఆర్‌ఎస్‌లో చేరుదామనుకున్నాడని, అది కుదరకపోయే సరికి తమ పైన విమర్శలు చేస్తున్నాడన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+