భవన్‌లో తుపాకీ కలకలం, భారీ ట్విస్ట్ -టీఆర్ఎస్ నేత కట్టెలపై ఆయుధ చట్టం కింద కేసు -పోలీసులు సుమోటోగా

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నాడు అధికార టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో తుపాకి కలకలం వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. సిటీకి చెందిన బీసీ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్ పార్టీ గెలుపు ఉత్సవాల్లో అతికి పోయి తుపాకి బయటికి తీసి హల్ చల్ చేయడం, అదే సమయంలో పార్టీ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం లాంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా,

టీఆర్ఎస్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్ తుపాకితో హల్ చల్ చేసిన ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. సదరు వీడియోలు వైరల్ కావడం, విమర్శలు వెల్లువెత్తడంతో అది కేవలం బొమ్మ తుపాకినే అని, నిజమైన గన్ కాదని సదరు నేత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ, శాంతిభద్రత, చట్టపాలన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సుమోటోగానే ఓ కేసు నమోదు చేశారు. ఏకంగా ఆయుధ చట్టం కింద కట్టెలపై కేసు పెట్టారు.

 trs leader Kattela Srinivas Yadav booked under arms act, hyderabad police files suo moto case

టీఆర్ఎస్ భవన్.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉండటంతో ఆ స్టేషన్ లోనే టీఆర్‌ఎస్‌ నేతపై ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్న పోలీసులు.. అది బొమ్మ తుపాకీ అయినాసరే, బహిరంగ ప్రదర్శన చేయడం నేరం కిందికే వస్తుందని పేర్కొన్నారు. ఆయుధ చట్టం కింద కేసు నమోదు కావడంపై టీఆర్ఎస్ నేతలు స్పందించాల్సి ఉంది.

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో రెండు స్థానాలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ స్థానంలో మాజీ ప్రధాని పీవీ కూతురు సురభి వాణిదేవి విజయం సాధించారు. ఆ గెలుపు సంబురాల్లోనే టీఆర్ఎస్ నేత కట్టెల తుపాకితో హల్ చల్ చేసి చివరికి బుక్కైపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+