మంత్రి సమక్షంలో నిప్పంటించుకున్న అయూబ్ ఖాన్ మృతి
హైదరాబాద్: తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో గత నెలలో నిప్పంటించుకున్న టీఆర్ఎస్ నేత, వికారాబాద్ జిల్లా తాండూరు పట్లణ మాజీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్(52) అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు.
తాండూరు పట్టణంలో ఆగస్టు నెలలో స్థానిక సమ్మద్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో అయూబ్ ఖాన్ తనకు అన్యాయం జరిగిందంటూ మనస్తాపానికి గురై మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలోనే ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి, టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు వాహనంలో స్థానిక జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయనిధి కింద వైద్య ఖర్చుల కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. దాదాపు నెలరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
కాగా, అయూబ్‌ఖాన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆది నుంచి టీఆర్ఎస్‌లో ఉన్న ఆయన.. తనకు నియమిత పదవి రాలేదంటూ ఆవేదనకులోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
అయూబ్‌ఖాన్ మృతి నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయన మృతదేహానికి మధ్యాహ్నం లేదా సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మంత్రి మహేందర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి అయూబ్‌ఖాన్ మృతదేహానికి నివాళులు అర్పించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications