నితీష్‌తో కలిసి సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన సీఎం కేసీఆర్
పాట్నా: దేశ సేవలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకోవడం మనందరి బాధ్యత అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భారత్-చైనా సరిహద్దు గాల్వాన్ ఘర్షణలో అమరులైన 10 మంది బీహార్ సైనికులకు బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
అమర సైనిక, కార్మికు కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం
బీహార్ పర్యటనలో భాగంగా పాట్నా చేరుకున్న కేసీఆర్.. తొలుత ఆ రాష్ట్ర సీఎం నీతీశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున అమరుల కుటుంబాలకు నీతీశ్‌తో కలిసి చెక్కులు అందించారు. దీంతో పాటు కొద్దినెలల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకూ రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
బీహార్ కార్మికులకు అండగా ఉంటామన్న కేసీఆర్
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీహార్‌లో చేపట్టే మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. దేశం కోసం అమర జవాన్లు ప్రాణాలు అర్పించారని, వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు.. సైనికులకు అండగా ఉంటాడని తెలిపారు. కరోనా సమయంలో వలస కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. స్వగ్రామానికి చేర్చడానికి కార్మికుల కోసం రైళ్లను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ అభివృద్ధిలో బీహార్ వలస కార్మికులు భాగస్వాములయ్యారని, అలాంటి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.
జాతీయ రాజకీయాలపై నితీష్, తేజస్వితో కేసీఆర్ చర్చలు
ఈ కార్యక్రమం అనంతరం జాతీయ రాజకీయాలు, విపక్ష ప్రభుత్వాలపై బీజేపీ వైఖరి, తదితర అంశాలపై కేసీఆర్, నీతీశ్ చర్చించే అవకాశముంది. ఇటీవలే నితీష్ కుమార్ బీజేపీని వీడి ఆర్జేడీ, ఇతర పార్టీలతో కలిసి బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బీహార్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేసీఆర్.. నేరుగా బీహార్ సీఎం నీతీశ్ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్‌కు నీతీశ్‌తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఘనస్వాగతం పలికారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications