స్కూళ్ల 2023-24 అకాడమిక్ క్యాలెండర్ విడుదల- సెలవులు ఇలా , కొత్తగా..!!
వేసవి సెలవులు ముగుస్తున్నాయి. తిరిగి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. గతం కంటే కొంత భిన్నంగా నిర్ణయాలు తీసుకుంది. పనిదినాలు..సెలవులను ప్రకటించింది. ఆటలు తప్పనిసరి చేసారు. ఇక నాలుగో శనివారం నో బ్యాగ్ డేగా స్పష్టం చేసింది. ఈ రోజున ఎలాంటి టైం టేబుల్ అమలు చేయాలనే దాని పైన విద్యా శాఖ విడిగా మార్గదర్శకాలు జారీ చేయనుంది.
తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇంకా వేసవి సెగలు తగ్గలేదు. రుతుపవణాలు 15 తరువాత ప్రవేశించే అవకాశం ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమేజూన్ 12 నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. ఇక బడి గంటలు మోగనున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాన విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం ప్రారంభం కానున్న విద్యా సంవత్సరంలో మొత్తం 229 పని దినాలుగా ఖరారు చేసారు. ఈసారి దసరా సెలవులను 14 రోజుల నుంచి 13 రోజులకు కుదించారు. అక్టోబర్ 14 నుంచి 25 వరకు ఈ సెలవులు ఉండనున్నాయి. క్రిస్మస్ సెలవులను కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.

ప్రతి నెల మూడో శనివారం పేరెంట్, టీచర్ మీటింగ్ నిర్వహించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలి. ఇక నాలుగో శనివారం నో బ్యాగ్ డే రోజూ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు.2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకాడమిక్ క్యాలెండర్‌లో స్పష్టం చేసారు. వారానికి 3 నుంచి 5 పీరియడ్లు ఆటలు తప్పనిసరి చేశారు. రోజూ 30 నిమిషాల పాటు పుస్తకాలు చదివడంతో పాటు.. 5 నిమిషాల పాటు పిల్లలతో యోగా, ధ్యానం చేయించాలని క్యాలెండర్ స్పష్టం గా పేర్కొన్నారు. పదో తరగతి సిలబస్ 2024 జనవరి 10 నాటికి పూర్తి చేసేలా షెడ్యూల్ ఖరారు చేసారు.












Click it and Unblock the Notifications