తెలంగాణ ఏఈఈ మెరిట్ లిస్ట్ విడుదల: ఇలా తెలుసుకోండి
హైదరాబాద్: రాష్ట్రంలోని 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(AEE) పోస్టుల భర్తీకి మే 8,9,21,22వ తేదీల్లో సీబీఆర్టీ విధానంలో రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబర్ 20న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రకటించింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల మెరిట్ జాబితాను సబ్జెక్టులవారీగా టీఎస్‌పీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్ https://websitenew.tspsc.gov.in/లో అందుబాటులో ఉంచింది.
పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ వివరాలను నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 1540 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన తుది ఆన్సర్ కీని ఇప్పటికే కమిషన్ విడుదలైంది.

తాజాగా సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అర్హులైన అభ్యర్థులను 1 : 2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు పిలవనుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగంలో 857 మందిని, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 27,145 మందిని, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో 10,948 మందిని, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 7,726 మందిని మెరిట్ జాబితాలో చేర్చింది.
తెలంగాణ టెట్ ప్రాథమిక కీ విడుదల
తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ప్రాథమిక కీ విడుదలైంది. తెలంగాణ టెట్ పేపర్-1, 2 'కీ'లను బుధవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు టెట్ కన్వీనర్ పేర్కొన్నారు. tstet.cgg.gov.inలో ప్రాథమిక కీని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. సెప్టెంబర్ 15న విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కు 2,69,557 మంది, పేపర్-2కు 2,08,498 మంది చేసుకున్నారు.
పేపర్-1 పరీక్షను 2,26,744 (84.12శాతం) రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షను 91.11 శాతం మంది రాశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరుగగా.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహించింది.












Click it and Unblock the Notifications