Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉచిత బస్సుల్లో మహిళల సీటింగ్ పై ఆర్టీసీ కీలక నిర్ణయం, ఇక నుంచి..!!

ఉచిత బస్సు పథకానికి ఆదరణ పెరుగుతోంది. మహాలక్ష్మీ పథకం మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. కొద్ది రోజులుగా ఉచిత బస్సుల్లో సీట్ల కేటాయింపుల పైన ఫిర్యాదులు వస్తున్నాయి. ఆర్టీసీ సిబ్బందికి హుందాగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు.. పురుషులకు సీట్ల కేటాయింపు పైన ఆర్టీసీ అధికారులు స్పష్టత ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్లకు పైబడి జీరో టికెట్లలను టీజీఎస్​ఆర్టీసీ జారీ చేసింది. గతంలో ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి(ఆక్యుపెన్సీ రేషియో) 67 శాతంగా ఉండేది. ఆర్టీసికి ప్రతినెలా భారీగా నష్టాలు వచ్చేవి. ఈ మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో సగటు ఓఆర్​ 95 శాతానికి పెరిగింది. మహిళలకు టీజీఆర్టీసీ 'జీరో' టికెట్లను జారీ చేస్తోంది. బస్​ టికెట్ల ఛార్జీల్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తోంది. నెలకు రూ.358.79 కోట్ల చొప్పున 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.4,305.49 కోట్లను బడ్జెట్‌లో ఉచిత బస్సు ప్రయాణానికి కేటాయించారు. కాగా, ఈ పథకం అమలు వేళ కొన్ని చోట్ల కొత్త సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. సీట్ల కేటాయింపు పైన వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.

tsrtc-clarifies-over-seats-allotment-for-women-in-free-buses-details-here

దీంతో, ఇప్పుడు పురుషులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీట్లు ఏమీ లేవని, అలాంటి నిబంధనలు కూడా ప్రస్తుతం విధించలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సుల్లో మహిళలకు 40 శాతం సీట్లు పోనూ మిగతా సీట్లలో ఎవరైనా కూర్చోవచ్చని స్పష్టం చేశారు. మిగతా సీట్లల్లో కూర్చున్న మహిళలను కండక్టర్లు బలవంతంతగా లేపినా లేదా దురుసుగా ప్రవర్తించినా అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు ఎవరైనా ఉచిత బస్సు ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే 040-69440000 లేదా 040-23450033 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఉద్దేశపూరంగా మహిళా ప్రయాణికులను ఎవరైనా ఇబ్బందు లకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. ప్రస్తుతం బస్సుల్లో 75 శాతం వరకు మహిళలే ప్రయాణిస్తుండటంతో తరచూ కండక్టర్లు, మహిళల మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా, ఆర్టీసీ తాజాగా ఇచ్చిన స్పష్టతతో మహిళా ప్రయాణీకులకు రిలీఫ్ దక్కనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+