హైదరాబాద్‌లో సరికొత్త సిటీ బస్సులు..!!

హైదరాబాద్: జంటనగరాల రోడ్లపై ఇక కొత్తగా ఎలక్ట్రిక్ సిటీ బస్సులు పరుగులు తీయనున్నాయి. పర్యావరణ హిత ఎలక్ట్రిక్‌ బస్సులను టీఎస్ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకుని రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశలవారీగా మొత్తం 1,300 ఎలక్ట్రిక్ బస్సులను వినియోగంలోకి తీసుకుని రావడానికి అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు.

కాలుష్యాన్ని నివారించడం, ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ వసతిని కల్పించడంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపించనున్నారు. తొలి దశలో భాగంగా త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వివిధ మార్గాల్లో నడిపించనున్నారు. కొత్త ప్రోటో ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ పరిశీలించారు.

TSRTC set to introduce electric ac buses in Hyderabad

బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ తయారు చేసిన 550 ఎలక్ట్రిక్ బస్సులకు తాము ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. 500 బస్సులను హైదరాబాద్‌ సిటీలో నడిపిస్తామని వివరించారు.

మరో 50 బస్సులను హైదరాబాద్- విజయవాడ రూట్‌లో అందుబాటులోకి తెస్తామని సజ్జనార్ అన్నారు. విజయవాడ రూట్‌లో ఇప్పటికే 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని గుర్తు చేశారు. మరో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయని, వాటిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఐటీ కారిడార్ ప్రవేశపెడతామని అన్నారు.

హైదరాబాద్‌లో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే నడిపేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి వస్తున్నాయని స్పష్టం చేశారు. వాటిల్లో 50 ఏసీ బస్సులు, మిగిలినవి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్‌లుగా అందుబాటులోకి తెస్తామని అన్నారు.

TSRTC set to introduce electric ac buses in Hyderabad

ఈ బస్సు పొడవు 12 మీటర్లు. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సులో మొబైల్ ఛార్జింగ్, సీటు బెల్ట్ సదుపాయం ఉంటుంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా కూడా ఉంటుంది.

గమ్యస్థానాల వివరాలు కోసం బస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేలా బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ వ్యవస్థను ఇందులో ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది ఈ బస్సు. ఫుల్ ఛార్జింగ్‌కు 2 నుంచి 3 గంటలకు సమయం పడుతుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+