హైదరాబాద్ లో పురుషులకు మాత్రమే బస్సులు - కండీషన్స్ అప్లై.!!
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ బాగా పెరిగింది. ఈ పథకం కారణంగా పురుషులకు అసలు సీట్లు దొరకటమే కష్టంగా మారింది. ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోతున్నామని రెడ్డెక్కారు. హైదరాబాద్ లో మెట్రోకు ఆదాయం తగ్గిపోయింది. ఈ సమయంలోనే పురుషుకుల ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పురుషులకు మాత్రమే అనే బోర్డులతో ప్రత్యేక బస్సులను రోడ్డు మీదకు తీసుకొచ్చింది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణీకుల సంఖ్య గణణీయంగా పెరిగింది. బస్సులోని వెనక సీట్ల వరకూ మహిళలే కనిపిస్తున్నారు. దీంతో, సీటు దొరకని పురుషులు దిగి వెళ్లిపోతున్నట్టు ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్ మీటింగ్‌లో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ.. కొన్ని రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపే అంశం తెర మీదకు వచ్చింది. విద్యార్థులకు సైతం ప్రత్యేక బస్సులు నిర్వహించాలనే విషయాన్ని అధికారులు యాజమాన్యంకు వివరించారు. సీనియర్ సిటిజన్లకు తొలి ప్రాధాన్యత గురించి చర్చించారు.

Recommended Video

దీంతో, ఏ మార్గాల్లో ప్రత్యేక బస్సులు అవసరం అవుతాయనే దాని పైన అధికారులు అధ్యయనం చేసారు.ప్రత్యేక బస్సులు నిర్వహించటమా లేక బస్సుల్లో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలా అనే విధంగా తర్జన భర్జన చేసారు. ప్రత్యేకంగా పురుషులకు బస్సులు నడిపితే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే దాని పైన ట్రయిల్ రన్ ప్రారంభించారు. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో తాజాగా పురుషుకుల మాత్రమే బోర్డులతో బస్సులు కనిపిస్తున్నాయి.
ఇవి పురుష ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా వారి కోసమే నిర్వహిస్తున్న బస్సులుగా చెబుతున్నారు. ఇందులో మహిళల ప్రయాణానికి అనుమతించరు. ఇబ్రహీం పట్నం- ఎల్బీనగర్ రూట్ లో ఈ బస్సు కనిపించింది. ఇప్పటికే బస్సుల్లో రోజుకు 30 లక్షల మందికి పైగా మహిళలు ప్రయాణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇలా పురుషులకు ప్రత్యేక బస్సులు నిర్వహణ కొనసాగుతుందా.. ప్రయోగాత్మకంగా అమలు చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటారా అనేది ఆర్టీసీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications