లాక్ డౌన్ మందు పార్టీ కేసులో ట్విస్ట్.. అధికారులపై రిపోర్టర్ల అట్రాసిటీ కేసు..
ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణంలో ఇటీవల వెలుగుచూసిన అధికారుల మందు పార్టీ ఘటన అనుకోని మలుపులు తిరుగుతోంది. అధికారుల మందు పార్టీని కొంతమంది రిపోర్టర్స్ బయటపెట్టగా.. ఉన్నతాధికారులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో విలేకరుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా.. అధికారుల ప్రైవసీకి భంగం కలిగించారని కేసు పెట్టారు.
ఈ నేపథ్యంలో తాజాగా రిపోర్టర్లు ఆ అధికారులపై కౌంటర్ కేసు నమోదు చేశారు. దళితులైన తమను అధికారులు దుర్భాషలాడటమే గాక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మందు పార్టీపై సమాచారం అందడంతో తాము గెస్ట్ హౌజ్ వద్దకు వెళ్లామని.. ఆ సమయంలో తహశీల్దార్ సైదులు డ్రైవర్ త్రివిక్రమ్ తమను అడ్డుకుని దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆపై మిగతా అధికారులు కూడా తమపై దుర్భాషలాడుతూ దాడి చేశారని పేర్కొన్నారు.

కాగా,అధికారుల మందు పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా నియంత్రణలో ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరిస్తుంటే.. కోవిడ్-19 విధులు నిర్వహిస్తున్న అధికారులు ఇలా మందు పార్టీ చేసుకోవడమేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మొత్తం 8 మంది అధికార బృందం గెస్ట్ హౌజ్‌లో మందు పార్టీ చేసుకోగా.. స్థానిక రిపోర్టర్లు దాన్ని బట్టబయలుచేశారు. గెస్ట్ హౌజ్‌లోని వంట గదిలో ఖరీదైన మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. అధికారులు వర్సెస్ రిపోర్టర్లకు మధ్య మలుపులు తిరుగుతోన్న ఈ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందోనన్నది ఆసక్తికరంగా మారింది.
Recommended Video
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications