దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

హైదరాబాద్‌లో.. ఉబర్, ఓలా సేవలు బంద్!

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   హైదరాబాద్‌లో.. ఉబర్, ఓలా సేవలు బంద్! Ola,Uber Cab Owners

   హైదరాబాద్‌: భాగ్యనగరంలో ఉబర్, ఓలా క్యాబ్ సేవలు సోమవారం నిలిచిపోయాయి. ఫైనాన్షియర్ల వేధింపులు, డ్రైవర్ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో సోమవారం ఉబర్, ఓలా క్యాబ్‌ల సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

   క్యాబ్ డ్రైవర్ల కష్టాన్ని ఈ రెండు సంస్థలు దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ వద్ద క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఈ విషయంలో ప్రభుత్వం కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

   హైదరాబాద్ నగరంలో క్యాబ్‌ల వినియోగం పెరగడంతో ఉబర్, ఓలా సంస్థలు తమ సేవలను మరింత విస్తరించాయి. కేవలం రూ.30 వేల డౌన్ పేమెంట్ చెల్లించి కారును మీ సొంతం చేసుకోవచ్చని, నెలకు రూ.70 వేలు సంపాదించొచ్చని డ్రైవర్లకు ఆశ చూపడం మొదలెట్టాయి.

   Uber, Ola Cab Owners And Drivers Go On Flash Strike In Hyderabad

   దీంతో నగరంలోని కొన్ని వందల మంది డ్రైవర్లు ఉబర్, ఓలా సంస్థల్లో చేరి కారు ఓనర్లుగా మారారు. అయితే తమకు రావాల్సిన నెలసరి మొత్తాన్ని ఫైనాన్స్, మెయింటెనెన్స్ రూపంలో ఈ రెండు సంస్థలు కాజేస్తున్నాయనేది క్యాబ్ డ్రైవర్ల ఆరోపణ. నెలకు రూ.70 వేలు అని చెప్పి.. ఇప్పుడు అన్నీ పోను రూ.15 వేలు ముట్టచెబుతున్నారంటూ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

   హైదరాబాద్ లో క్యాబ్ బిజినెస్ చాలా బాగుందనే ప్రచారం జరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల నుంచి ఎంతోమంది డ్రైవర్లు హైదరాబాద్ వచ్చి.. సొంతంగా కార్లు కొనుకుని ఓలా, ఉబర్‌లో చేరారు. కానీ అనతికాలంలోనే వీళ్లలో చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

   ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు వేడుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టేంతవరకు క్యాబ్‌ల బంద్‌ను కొనసాగుతుందని వారు పేర్కొంటున్నారు.

   English summary
   Further intensifying their fight for better wages and fairer share in profits, thousands of Uber and Ola cab owners and drivers went on a flash strike on Monday. Hundreds of cabs attached to Uber and Ola services by private owners were gathered at Secunderabad station and the owners and drivers staged protest demanding state government's intervention in their issue. Representatives of Telangana Cab Owners and Drivers Association said hundreds of families of drivers and owners who attached their cabs on the hope of getting Rs70,000 per month were on the streets today as both Uber and Ola failed to fulfill their promise.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more