• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నయీంను చూల్లేదు, కేసీఆర్‌నే ప్రశ్నిస్తున్నా, చూసుకుందాం: ఉమామాధవ రెడ్డి

|

భువనగిరి: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆయనతో లింకులు ఉన్నాయంటూ తన పేరును తెరపైకి తీసుకు రావడంపై మాజీ మంత్రి, టిడిపి నేత ఉమా మాధవ రెడ్డి గురువారం నాడు స్పందించారు. తన పేరును లాగడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంకు తెలియకుండా ఈ వ్యవహారం జరగలేదన్నారు.

నయీంను ఎన్నడూ చూడలేదు

తాను ఇప్పటి దాకా నయీంను చూడలేదని చెప్పారు. ఓ మహిళకు మాఫియాతో అంటగట్టడం సరికాదన్నారు. జ్యూడిషియల్ విచారణకు డిమాండ్ చేస్తున్నానని, దోషిగా తేలితో తాను జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు.

ప్రభుత్వం కక్ష కట్టింది

ప్రభుత్వం తమ పైన కక్ష కట్టిందని ఉమా మాధవ రెడ్డి అన్నారు. మా కుటుంబానికి మచ్చ తెచ్చేందుకు నయీం కేసులో తమ పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. మా కుటుంబానికి ఎప్పుడు కూడా మచ్చ లేదన్నారు. ఇక్కడి ప్రజానీకానికి తెలుసునని చెప్పారు. కుట్రతో ఈ కేసును అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

మాధవ రెడ్డి పేరు చెడగొట్టేందుకే

ఇక్కడ మాధవ రెడ్డికి మంచి పేరు ఉందని, ఆయన పేరును చెడగొట్టేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ప్రజలు అన్ని కుట్రలను గమనించి, ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. తాను సౌమ్యురాలిని అని అందరికీ తెలుసునని చెప్పారు. తనకు నేర చరిత్ర లేదన్నారు. అలాంటి నాకు నేర చరిత్ర అంటగడతారా అన్నారు.

నా కాల్ లిస్ట్ బయటపెట్టండి

నయీం కాల్ లిస్టులో తన ఫోన్ నెంబర్ ఉందని, తమ ల్యాండ్ నెంబర్ కూడా ఉందని వార్తలు వచ్చాయని ఇది సరికాదని ఉమా మాధవ రెడ్డి అన్నారు. తన భర్త మాధవ రెడ్డి ఉన్నప్పటి నుంచి నేను ఒకటే ఫోన్ వాడుతున్నానని, దానిని పరిశీలించుకోవచ్చునని చెప్పారు. తన ఫోన్ డాటా వివరాలు బయటపెట్టాలన్నారు. తన ఇంట్లో అసలు ల్యాండ్ ఫోనే లేదన్నారు.

తనకు నయీం నుంచి ఫోన్లు రాలేదని, అలాగే నయీంకు తాను ఫోన్ చేయలేదని చెప్పారు. మాధవ రెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పటి గురించి తనకు ఏం తెలుసునని చెప్పారు. కుట్ర రాజకీయాలు, నేర పూరిత రాజకీయాలు చేసేందుకు తాను రాలేదన్నారు. నా ఫోన్ డాటా వివరాలు బయటపెట్టాలన్నారు.

హత్యా రాజకీయాలు అవసరమేంటి

తన పైన వచ్చిన ఇంకో వార్త తనను బాగా బాధించిందన్నారు. భువనగిరి ఎమ్మెల్యేను చంపేసేందుకు మాజీ మంత్రి టార్గెట్ పెట్టారని చెబుతున్నారని, తనను ఇందులోకి కూడా లాగడం దారుణమన్నారు. హత్యా రాజకీయాలు తనకు అవసరం లేదన్నారు.

Uma Madhava Reddy responds on Nayeem murder case

తనకు అలాంటివి అవసరం లేదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. చంపించేంత నీచ ప్రవృత్తి తమకు లేదన్నారు. తమది గ్యాంగ్ స్టర్లను ప్రోత్సహించే చరిత్ర కాదన్నారు. పోలీసు డిపార్టుమెంటులో కొందరికి నయీంతో సంబంధాలు ఉన్నాయని, వారు తప్పించుకునేందుకు తమను లాగి ఉండవచ్చన్నారు.

ఓ సామాజిక వర్గంపై కుట్ర

ఓ సామాజిక వర్గంలో మాధవ రెడ్డికి పేరు ఉందని, కాబట్టి అలాంటి వ్యక్తి పేరును చెడగొడితే ఆ సామాజిక వర్గాన్ని దెబ్బ తీయవచ్చునని భావిస్తున్నారని మండిపడ్డారు. ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని ఇలాంటి లీకులు ఇస్తున్నారన్నారు. నయీం భువనగిరికి చెందిన వాడే కావొచ్చు. కానీ తనకేం సంబంధం అన్నారు.

ముఖ్యమంత్రినే ప్రశ్నిస్తున్నా

నేను నా మానాన నేను బతుకుతున్నానని, అలాంటి తనను ఈ కేసులోకి లాగడం సరికాదన్నారు. తన పేరు లాగినందుకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రిని తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ఈ లీకు వచ్చిన విషయమై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

జ్యూడిషియల్ విచారణకు డిమాండ్

తాము ప్రతిపక్షంలో ఉన్నామని, తెలుగుదేశం పార్టీ పైన కుట్రతో తనకు ఇలా లింకులు అంటగట్టి ఉండవచ్చునని చెప్పారు. సిట్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన సంస్థ కాబట్టి జ్యూడిషియల్ విచారణ కోరుతున్నానని చెప్పారు. తాను తప్పు చేసినట్లు తేలితో జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు.

నక్సలైట్ల పైన కక్ష తీర్చుకున్నందుకు నయీంను తాను వాడుకున్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయని, అందుకే తాను స్పందిస్తున్నానని చెప్పారు. తమ కుటుంబాన్ని మళ్లీ నక్సలైట్లకు టార్గెట్‌గా చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.

అయిదేళ్లు గ్యాప్ ఇచ్చారు.. చూసుకుందాం..

తమకు (టిడిపి) ప్రజలు అయిదేళ్లు గ్యాప్ ఇచ్చారని, 2019లో చూసుకుంటామని చెప్పారు. అంతేకానీ ఎమ్మెల్యేను చంపించి ఉప ఎన్నికల్లో గెలవాలనే కోరిక తమకు లేదన్నారు. ఓ కుటుంబ పెద్ద పోతే ఎలా ఉంటుందో తమకు తెలుసునని, అలాంటిది నేను ఎమ్మెల్యేను ఎందుకు టార్గెట్ చేస్తానని చెప్పారు. భువనగిరి మాజీ మంత్రి అంటే తనకే వచ్చిందని, అందుకే తాను బయటకు వచ్చానని చెప్పారు.

అన్ని పార్టీల వారు..

నయీం అనుచరులలో కేవలం టిడిపి వారే లేరని, అన్ని పార్టీల వారు ఉండవచ్చునని చెప్పారు. తనకు ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారాలు లేవని చెప్పారు. కానీ నయీంతో తనకు సంబంధాలు ఎందుకు అంటగడుతున్నారని ఆమె ప్రశ్నించారు.

English summary
Uma Madhava Reddy responds on Nayeem murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X