వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైట్లీ బడ్జెట్: 'సామాన్యుడి'తో ఏ కంపెనీలకు లాభం, ఎవరికి నష్టం?

కేంద్ర బడ్జెట్... దేశంలోని అందరు దీని కోసం వేచి చూస్తుంటారు. లెక్కలు పత్రాల కోసమే కాదు... గంటన్నర రెండు గంటల ప్రసంగంలో ఏమైనా పొలిటకల్ మెసేజ్ ఉంటుందా అని కూడా చూస్తుంటారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్... దేశంలోని అందరు దీని కోసం వేచి చూస్తుంటారు. లెక్కలు పత్రాల కోసమే కాదు... గంటన్నర రెండు గంటల ప్రసంగంలో ఏమైనా పొలిటకల్ మెసేజ్ ఉంటుందా అని కూడా చూస్తుంటారు.

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆమ్ ఆద్మీకి ఊరట నిచ్చింది. నోట్ల రద్దు ప్రభావంతో వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. రైతులకు ఎన్నో ఊరట కలిగించే అంశాలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయి. ఈ బడ్జెట్‌ను పది లక్షాలతో రూపకల్పన చేశారు.

వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు, గ్రామీణ ప్రజలకు మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, యువతకు విద్యాపరంగా నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగాలు కల్పించడం వంటివి ఉన్నాయి. - మిషన్ అంత్యోదయ కింద కోటి ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు.

<strong>బడ్జెట్ 2017-18 విశేషాలు</strong>బడ్జెట్ 2017-18 విశేషాలు

Union budget 2017: A Quick Look At Winners And Losers

రైతులకు బీమా కవరేజ్ పెంచుతున్నట్లు చెప్పారు. ఏడాదికి రూ.10 లక్షల కోట్ల రుణం ఇవ్వనున్నట్లు చెప్పారు. నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల్లో పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి. దీంతో ఇళ్ల రుణాలు తగ్గుతాయని చెప్పారు. ఆదాయ పన్ను అంశంలోను స్వల్ప ఊరటనిచ్చారు. రైల్వేలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు.

మొత్తానికి తాజా బడ్జెట్‌లో లాభం ఎవరికి? నష్టం ఎవరికి? అనే అంశం చర్చకు వస్తోంది. రైతులు, రియల్ ఎస్టేట్, బ్యాంకులుకు లబ్ధి చేకూరుతుంది.

రైతులు - రైతులకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.10 లక్షల కోట్ల రుణం ఇస్తామని జైట్లీ చెప్పారు. అలాగే, గ్రామీణ ఉద్యోగ హామీ పథకానికి రూ.480 కోట్లు కేటాయించారు. గ్రామాలకు విద్యుత్. గ్రామాలకు, రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మహింద్రా అండ్ మహింద్రా లిమిటెడ్ వంటి ట్రాక్టర్ కంపెనీలకు లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి.

రియల్ ఎస్టేట్ - రానున్న అయిదేళ్లలో పెద్ద ఎత్తున ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. ఆ సెక్టారుకు ఇది లబ్ధి చేకూర్చే అవకాశాలున్నాయి. డీఎల్ఎఫ్ లిమిటెడ్, గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, ఒబెరాయ్ రియాలిటీ లిమిటెడ్ తదితరాలపై ప్రభావం పడనుంది.

ప్రభుత్వం మౌలిక వసతులు, నిర్మాణ రంగంపై రూ.3.96లక్షలు వెచ్చించాలని నిర్ణయించింది. నిర్మాణరంగ షేర్లకు మంచి జోష్‌ను ఇచ్చింది.

వినియోగ వస్తువులు - రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను పైన పది శాతం నుంచి 5 శాతానికి పన్నును తగ్గించారు. వినియోగ వస్తు సెక్టారుకు ఇది లాభం చేకూరే అంశం. వాహన పరిశ్రమ పైన కూడా దీని ప్రభావం ఉండనుంది. దీంతో ఐటీసీ లిమిటెండ్, హిందూస్తాన్ యూనివర్ లిమిటెడ్, మారుతి సుజుకీ, హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీల షేర్ల పైన ప్రభావం పడుతుంది.

బ్యాంకులు - బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్ కోసం వంద బిలియన్లను కేటాయిస్తున్నట్లు తెలిపింది.

నష్టం ఎవరికి?

డ్రగ్ మార్కెట్ - గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం పైన కేంద్రం మరింత దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు మందులు (మెడిసిన్స్) అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చూస్తోంది. సరసమైన హెల్త్ కేర్, జెనెరిక్స్‌ను ఎంకరేజ్ చేయనుంది. వీటి ప్రభావం డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ పైన పడనుంది.

ఇంకా.. రూ.50కోట్ల టర్నోవర్‌లోపు ఉన్న సంస్థలకు పన్ను తగ్గించడం మార్కెట్‌కు కలిసివచ్చింది. దాదాపు 96శాతం కంపెనీలు ఈ లబ్ధిని అందుకోనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తిలో ద్రవ్యలోటు 3.2శాతం మాత్రమే కొనసాగించడం.. 2017-18లో దీనిని మూడు శాతానికి పరిమితం చేస్తానని చెప్పటం. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులకు రూ.10,000 మూలధనాన్ని సమకూర్చడం.

English summary
India's annual budget is one of the nation's most closely watched events -- not just for the numbers, but for the political message during a speech that runs for about 90 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X