ఆ విషయంలో కేసీఆర్ తీరుకు ప్రతిపక్ష నేతలు ఫిదా..!

హైదరాబాద్ : చేయూతనివ్వాలంటూ.. తన దృష్టిలోకి వచ్చే ఏ అభ్యర్థనకైనా సానుకూలంగానే స్పందిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాజకీయాలను సైతం పక్కనబెట్టి ఈ విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీల చేత కూడా ఆయన్ను పొగిడేలా చేస్తున్నాయి.

ఇదే తరహాలో తాజాగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హబ్సిగూడకు చెందిన నవీన్ కుమార్ అనే దళిత యువకుడు ఉప్పల్ ఎమ్యెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సహాయంతో సీఎం కేసీఆర్ కి తన అభ్యర్థనను తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నవీన్ కుమార్ తో దరఖాస్తు చేయించిన ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఆ తర్వాత సీఎం కేసీఆర్ ని నేరుగా కలిసి నవీన్ కుమార్ వేదన గురించి, అతని ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు.

Uppal Mla Nvss Prabhakar praised Cm KCR

ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అభ్యర్థనతో అప్పటికప్పుడే స్పందించిన సీఎం కేసీఆర్ ఆపరేషన్ కోసం అయ్యే ఖర్చు రూ. 29,29,400 ల మొత్తాన్ని నవీన్ కుమార్ కు అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో నవీన్ కుమార్ ఆపరేషన్ కూడా విజయవంతం ముగియగా.. మంగళవారం నాడు సీఎం కేసీఆర్ విడుదల చేసిన చెక్కును ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, నవీన్ కుమార్ కు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. సీఎం కేసీఆర్ ని మానవత్వమున్న మనిషిగా అభివర్ణిస్తూ పొగడ్తల్లో ముంచెత్తారు. మనిషిగా ఆయన మానవత్వానికి నవీన్ కుమార్ కి చేసిన సహాయమే ప్రత్యక్ష ఉదాహరణ అని కితాబిచ్చారు. ఏదేమైనా సహాయం కోసం తన వద్దకు వచ్చే ఏ వ్యక్తికైనా సీఎం కేసీఆర్ కాదనకుండా సహాయం చేయడం అందరి మన్ననలను పొందుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+