పోలీస్ రిక్రూట్‌మెంట్ తీపి కబురు: 3ఏళ్ల వయో సడలింపు
హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ ఉద్యోగాలకు వయో పరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వయో పరిమితి పెంపు ప్రకారం నోటిఫికేషన్‌ను పోలీసు నియామక సంస్థ సంవరించింది.
జూన్ 9-30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. 18,428 పోలీసు ఉద్యోగాల భర్తీకి మే 31న తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. వాటన్నింటిలోనూ గతంలో ఉన్న నిబంధనల్నే పెట్టడంతో నిరుద్యోగులు తీవ్రంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

వయో పరిమితిని పెంచాలంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్‌నగర్‌లలో తీవ్ర ఆందోళన చేయడంతోపాటు డీజీపీ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిశీలించిన అనంతరం బుధవారం పోలీసు శాఖకు ఉత్తర్వులు పంపింది.
ప్రస్తుతం ఎస్సై, కానిస్టేబుల్, జైళ్లు, అగ్నిమాపక శాఖలో మొత్తం నాలుగు నోటిఫికేషన్లు జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎస్ఐ ఉద్యోగాలకు 28ఏళ్లు కల్గిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కానిస్టేబుళ్ల గరిష్ట పరిమితి 22ఏళ్లు కాగా.. ఇప్పుడు 25ఏళ్ల వయస్సు వారు కూడా దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుంది. వయో పరిమితి పెంచడం వల్ల దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications