డీఎస్ కాంగ్రెస్‌లోకి వస్తే ఒప్పుకోం: వీహెచ్, ‘శీనన్న అంటే చాలు.. కేసీఆర్ భజనే’
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత డీ శ్రీనివాస్(డీఎస్)పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీ శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వీహెచ్ స్పందించారు.

డీఎస్‌ను సస్పెండ్ చేయాలంటూ..
డీఎస్‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ నేతలు సీఎం కేసీఆర్‌కు ఇటీవల ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ ను కలిసేందుకు డీఎస్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదని తెలిసింది.
Recommended Video


డీఎస్ వస్తామంటే ఒప్పుకోం
ఈ క్రమంలో డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుతున్న నేపథ్యంలో వీహెచ్ తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు డీఎస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు.

కేసీఆర్ శీనన్న అంటే చాలు..
ఒక వేళ డీఎస్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నా.. కేసీఆర్ మళ్లీ పిలిచి శీనన్న అంటే చాలు.. కేసీఆర్‌కు డీఎస్ భజన చేస్తారని వీహెచ్ ఎద్దేవా చేశారు. అందుకే డీఎస్‌ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలో, వద్దో ఓసారి పార్టీ నేతలు ఆలోచించుకోవాలని సూచించారు.

కేసీఆర్‌కు ఓట్లంటేనే ప్రేమ..
కేసీఆర్‌కు బీసీలపై ప్రేమ లేదని, వారి ఓట్లపైన మాత్రమే ఉందని వీహెచ్ వ్యాఖ్యానించారు. కాగా, తన అనుచరులు, కార్యకర్తలతో ఇటీవల డీఎస్ సమావేశం కావడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. అయితే, దీనిపై డీఎస్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications