చంద్రబాబును అభినందించిన వీహెచ్, ‘నవంబర్ తొలివారంలో అభ్యర్థుల ప్రకటన’

హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల పంపకంపై పంతానికి పోవద్దని టీటీడీపీ నేతలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను చంద్రబాబును అభినందిస్తున్నట్లు కాంగ్రెస్ వ్యూహ రచన కమిటీ ఛైర్మన్ అయిన వీహెచ్ వ్యాఖ్యానించారు.

 ఢిల్లీకి ఎందుకు పిలవలేదు?

ఢిల్లీకి ఎందుకు పిలవలేదు?

బీసీలకు సంబందించి ఢిల్లీ సమావేశానికి తనను పిలవకపోవడంపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులైన భక్త చరణ్ దాస్, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతానని చెప్పారు. తనతోపాటు పొన్నాల లక్ష్మయ్య, ఆనంద్ భాస్కర్‌ను ఎందుకు ఆహ్వానించలేదో వారు చెప్పాలని డిమాండ్ చేశారు.

బీసీలకు 34సీట్లు

బీసీలకు 34సీట్లు

కాంగ్రెస్ పార్టీలో బీసీలకు 34 సీట్లు కేటాయించాలని అధిష్టానాన్ని కోరతామని హనుమంతరావు అన్నారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెండేసి సీట్ల చొప్పున అడుగుతున్నట్లు తెలిపారు.

కేసీఆర్ కంటే ఎక్కువే...

కేసీఆర్ కంటే ఎక్కువే...

మహాకూటమిలో మిత్రపక్షాల కోసం సీట్ల త్యాగానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా అన్నారు. బీసీ అభ్యర్థులకు కేసీఆర్ ఇచ్చినవాటికంటే ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పారు.

 నవంబర్ తొలివారంలో అభ్యర్థుల ప్రకటన

నవంబర్ తొలివారంలో అభ్యర్థుల ప్రకటన

గెలిచే అభ్యర్థుల ప్రాతిపదికగా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో మిత్రపక్షాలతో కలిసి కేసీఆర్‌ను ఓడిస్తామని అన్నారు. నవంబర్ నెల తొలివారంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని కుంతియా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+