ఇంట్లోనే ఇతర అమ్మాయిలతో..: విజయ్ అక్రమసంబంధాలపై వనిత ఫొటోల సంచలనం
Recommended Video

హైదరాబాద్: నటుడు విజయసాయి ఆత్మహత్యకేసులో రోజుకో విషయం బయటపడుతోంది. తాజాగా విజయసాయి భార్య వనితారెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.
విజయసాయి ఇతర అమ్మాయిలతో అక్రమ సంబంధాలు కొనసాగించేవాడని ఆమె ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను కూడా వనితారెడ్డి బయటపెట్టడం గమనార్హం.

ఇంట్లోనే ఇతర అమ్మాయిలతో..
తన ఇంట్లోనే ఇతర అమ్మాయిలతో విజయసాయి గడిపేవాడని వనితా రెడ్డి ఆరోపించారు. పలువురు అమ్మాయిలతో ఆయనకు అక్రమ సంబంధాలున్నాయని చెప్పారు. ఆ అక్రమ సంబంధాలపై నిలదీసినందుకే తనపై విజయసాయి దాడి చేశాడని వనిత తెలిపింది.

ఫొటోలు బయటపెట్టిన వనిత
అక్రమ సంబంధాల నేపథ్యంలోనే తాను విజయసాయిని వదిలిపెట్టి వెళ్లిపోయానని వనిత ఆరోపించారు. అందుకే ఆయనకు నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నానని వనిత చెప్పారు. అంతేగాక, పలువురు అమ్మాయిలతో విజయసాయి ఏకాంతంగా ఉన్న ఫొటోలను ఆమె బయటపెట్టారు.

నన్నే టార్గెట్ చేశారు
విజయ్ చనిపోయాక తాను ఎక్కడికి పారిపోలేదని వినత తెలిపారు. తన బిడ్డ భవిష్యత్ తనకు ముఖ్యమని అన్నారు. తన అత్తామామలు కూడా తనను పట్టించుకోవడం లేదని అన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని వారు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను ఆస్తులు లాగేసుకున్నారని, తనకు సినిమా, టీవీల్లో అవకాశాలు రావడం లేదని అన్నారు. తన బిడ్డను ఎలా పోషించుకోవాలని అన్నారు. తనకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు అని వనిత ప్రశ్నించారు.

మరిన్ని ఫొటోలు, వీడియోలు బయటపెడ్తా..
తాను తప్పు చేయలేదని, తనకు పారిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. విజయసాయికి సంబంధించిన అక్రమ సంబంధాల ఫొటోలు, వీడియోలతో తాను పోలీసుల ముందుకు వస్తానని వనితా రెడ్డి చెప్పారు. మీడియా తనకు సహకరించాలని అన్నారు.

తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో..
తన సోదరి అదృశ్యమవడంపై వనితా రెడ్డి సోదరుడు రాంచందర్ రెడ్డి స్పందించారు. ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. తన అక్క ఎక్కడికి పారిపోలేదని చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో తిరిగి వస్తుందని అన్నారు. తన అక్క ఆమె కూతురు భవిష్యత్ కోసం ఆరాటపడుతోందని అన్నారు. విజయసాయికి అక్రమ సంబంధాలున్న మాట నిజమేనని అన్నారు. విజయసాయి తన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఇతర అమ్మాయిలను ఇంటికి తీసుకువచ్చేవాడని అన్నారు. తన అక్క ఎంత చెప్పినా వినేవాడు కాదని అన్నారు. బాగుందని చాలా సార్లు చెప్పిందని అయినా విజయసాయి వినలేదని చెప్పాడు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని తెలిసి తన సోదరి అతనికి దూరంగా ఉండిపోయిందని తెలిపారు.
-
Tamil Nadu Polls: దక్షిణాది పీక నొక్కేస్తారా ? నిప్పులుచెరిగిన విజయ్..! -
విజయ్ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! వీడియో -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications