గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యంత భారీ వర్షం: ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ ప్రజలకు వార్నింగ్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం సాయంత్రం నుంచి అత్యంత భారీ వర్షం కురుస్తోంది. జంట నగరాల్లో కుండపోత వర్షం పడుతుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. భారీ వర్షంతో అరగంటలోనే నగర రహదారులు వరదనీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి.
కుత్బుల్లాపూర్, తిరుమలగిరి, అల్వాల్, బోయిన్‌పల్లి, జవహర్ నగర్, బేగంపేట్, బొల్లారం, మారేడ్ పల్లి, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, హబ్సిగూడ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మెహదీపట్నం, ఆసిఫ్‌నగర్, చైతన్యపురి, గుడి మల్కాపూర్, నాంపల్లి, మల్‌కపేట, దిల్‌సుఖ్‌నగర్, ఖైరతాబాద్, పంజాగుట్టా, లక్డీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, సుల్తాన్‌బజార్, బేగంబజార్, బషీర్‌బాగ్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వాన కురుస్తోంది.

కూకట్‌పల్లి, కాచిగూడ, విద్యానగర్, అంబర్‌పేట, ఉప్పల్, ఘట్కేసర్, రాజేంద్రనగర్, గండిపేట, కోఠి, అబిడ్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, అనవసర ప్రయాణాలు చేయవద్దని డీఆర్ఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. సహాయక చర్యల కోసం 040-21111111, 9000113667 నంబర్లలో సంప్రదించాలని డీఆర్‌ఎఫ్ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి రావ్దొదని కోరింది.
కాగా, ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన అత్యంత భారీ వర్షంతో కాసేపు హైదరాబాద్ జనం వణికిపోయారు. గంటకుపైగా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలతోపాటు రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల హోర్డింగులు, చెట్లు కూలిపోయాయి. దీంతో సహాయం కోసం డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీకి వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
Blinding rain, evening traffic and flooded streets of #Hyderabad pic.twitter.com/9VD6tvruEJ
— serish (@serish) July 24, 2023
మరోవైపు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం అలర్ట్ అయ్యారు. వర్షం నీరు భారీగా చేరే ప్రాంతాల్లో చర్యలు ప్రారంభించారు. సుమారు గంటకుపైగా వర్షం దంచికొట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
హైదరాబాద్ :కృష్ణా నగర్ లో జలమయమైన లోతట్టు ప్రాంతాలు..!#HyderabadRains #HeavyRains #RainAlert #WeatherReport #Telangana #Oneindiatelugu pic.twitter.com/puuzDyprtE
— oneindiatelugu (@oneindiatelugu) July 24, 2023
జనాలు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్ నగరంలో దాదాపు అన్ని ప్రధాన కూడళ్లలో వాహనాలు ఆగిపోయాయి. ఇదిలా ఉంటే వాతవారణ శాఖ అధికారులు రేపు హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. మంగళవారం నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications