Victory Venkatesh: ఖమ్మం జిల్లాకు విక్టరీ వెంకటేష్..!

దగ్గుబాటి వెంకటేష్ తండ్రి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. కలియుగ పౌండవులతో సినీ రంగ ప్రవేశం చేసి ప్రముఖ హీరోగా ఎదిగారు. విజయాన్ని తన పేరులో కలిపేసుకుని విక్టరీ వెంకటేష్ అయ్యాడు. వెంకటేష్ కు కుటుంబ కథ చిత్రాలతో మహిళా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వెంకటేశ్ సినీ ఇండస్ట్రీలో సౌమ్యమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.

ఎలాంటి వివాదాలకు తావులేకుండా కేరీర్ లో ఎదిగారు. ఆయన ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకు ప్రచారం చేయాలేదు. కానీ ఈసారి మాత్రం ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. తన వియ్యంకుడిని గెలిపించుకునేందుకు వెంకీ మామ ప్రచార బరిలోకి దూకనున్నారు. మంగళవారం వియ్యంకుడు రఘురాం రెడ్డి కోసం విక్టరీ వెంకటేష్ ఖమ్మంలో ప్రచారం నిర్వహించనున్నారు.

Victory Venkatesh will campaign for Congress in Khammam

మరోవైపు విక్టరీ వెంకటేష్ కూతురు, రఘురాం రెడ్డి కోడలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. మామను గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. రఘురాం రెడ్డి పెద్ద కుమారుడికి వెంకటేష్ కూతురు అశ్రీతను ఇచ్చారు. ఇక చిన్న కుమారుడికి మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డను ఇచ్చారు. దీంతో వెంకటేష్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడి విజయం కోసం కృషి చేస్తున్నారు.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మే 13 తేదీన జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు ఎన్నికలు జరుగుతోన్నాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+