ఆత్మహత్య వల్లే విజయ్ మృతి, హెచ్ఐవీ పరీక్షలు, పోన్ సంభాషణలతో వనితా కౌంటర్
Recommended Video

హైదరాబాద్: సినీ నటుడు విజయ్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయాడని ఉస్మానియా వైద్యులు తేల్చారు. అంతేకాదు విజయ్ సాయి దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడని ఆయన భార్య వనితారెడ్డి చేసిన ఆరోపణలపై ఉస్మానియా వైద్యులు హెచ్ ఐవి పరీక్షలు నిర్వహించారు.
సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసు రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. విజయ్ చనిపోయే ముందు తీసుకొన్న సెల్పీ వీడియో రికార్డు చేశారు.అయితే ఈ వీడియో ఆధారంగా విచారణ జరపాలని విజయ్ సాయి తండ్రి సుబ్బారావు డిమాండ్ చేస్తున్నారు.
విజయ్ సాయి చేసిన ఆరోపణలతో పాటు ఆయన తండ్రి సుబ్బారావు చేసిన ఆరోపణలపై వనితా రెడ్డి వివరణ ఇచ్చారు. తమ అభిప్రాయాలను సమర్ధించుకొన్నారు.అయితే ఈ విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణలో వాస్తవాలు తేలుతాయన్నారు.

మెడనరాలు తెగడంతోనే విజయ్ మరణించారు
మెడ నగరాలు తెగడం వల్లే సినీ నటుడు విజయ్ సాయి మరణించాడని ఉస్మానియా వైద్యులు ప్రకటించారు. విజయ్ సాయి ప్యాన్‌కు ఉరేసుకొన్నాడు. ఉరేసుకొన్న సమయంలో విజయ్ సాయి మెడ నరాలు తెగాయి. ఈ కారణంగానే విజయ్ సాయి చనిపోయాడని ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. మంగళవారం నాడు విజయ్ సాయి మృతదేహనికి పోస్ట్ మార్టమ్ పూర్తి చేశారు. ఈ పోస్ట్ మార్టమ్ నివేదికలో వైద్యులు నిర్ధారించారు.

విజయ్‌కు హెచ్ ఐ వి పరీక్షలు
వీజయ్ దీర్ఘకాలిక వ్యాధితో భాదపడుతున్నారని విజయ్ సాయి భార్య వనితా రెడ్డి ఆరోపించారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద విజయ్ మృతదేహన్ని చూసిన తర్వాత మీడియాతో మాట్లాడిన వనితా రెడ్డి విజయ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కూడ ఉస్మానియా వైద్యులు హెచ్ ఐ వి పరీక్షలు కూడ నిర్వహించారు.

విజయ్, సుబ్బారావు ఆరోపణలపై వనితారెడ్డి కౌంటర్
విజయ్ సాయి చనిపోయే ముందు వనితారెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై వనితారెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయ్ ఆత్మహత్య చేసుకొనే సమయంలో తనపై చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు.విజయ్ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారో విషయమై వనితారెడ్డి ఆరోపణలు చేశారు.గతంలో తన మామతో తాను జరిపిన సంభాషణ ఆడియో కూడ బయటకు వచ్చింది.

విజయ్, వనిత మధ్య ఫోన్ సంభాషణ
కమెడియన్ నటుడు విజయ్, వనిత మధ్య జరిగిన ఓ ఆడియో టేప్ బయటకు వచ్చింది. వనిత గురించి విజయ్ తీవ్ర ఆందోళన చెందాడని, భార్యకు ఫోన్ చేసి నచ్చజెప్పే యత్నం చేశాడని సమాచారం. విజయ్ ఆత్మహత్య తర్వాత బయటపడిన సెల్ఫీ వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వాటి ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందని తెలియవచ్చింది.












Click it and Unblock the Notifications