కేసీఆర్ ను గద్దె దించేవరకు నిద్రపోను: విజయశాంతి

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిని మించి ఒకరు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి ఇప్పుడిప్పుడే మాటల తూటాలను పేలుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న విజయశాంతి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు.

కేసీఆర్‌ను గద్దె దించే వరకు తాను నిద్రపోనని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. మెదక్‌లో మైనంపల్లి రోహిత్ తరుపున ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి కేసీఆర్ పై మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించిన విజయశాంతి, మరోసారి కేసీఆర్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.

Vijayashanthi lashed out at KCR that she will not sleep until KCR is ousted

కవిత లిక్కర్ స్కామ్‌లో దొరికినందుకు ఓటేయాలా అని సెటైర్ వేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ మాట్లాడుతుంది కానీ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే తాను పార్టీ మారానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తాను తెలుసుకున్నానని, కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి ఆరు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక తూచా తప్పకుండా హామీలను అమలు చేస్తామని పేర్కొన్నారు విజయశాంతి.

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జెట్ స్పీడ్ లో సాగుతుందని, ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 80 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనను చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారని, అయినా వారి విమర్శలను తాను ఆశీస్శులుగా భావిస్తానని అన్నారు.

రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోవాలన్న విజయశాంతి మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో ఇంకా కొట్లాడుతున్నానని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీతో తెలంగాణా ఏ మాత్రం అభివృద్ధి చెందదని పేర్కొన్న విజయశాంతి తెలంగాణా అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. తమ ముందు ఉంది ఏకైక లక్ష్యమని, కేసీఆర్ సర్కార్ ను కూలగొట్టటమే తమ కర్తవ్యమని విజయశాంతి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలని ఓటర్లకు విజయశాంతి విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+