జనసేన, బీజేపీలకు నష్టం చేస్తున్న కేసీఆర్ కు కర్రుకాల్చి వాత పెట్టటం ఖాయం

తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో చేస్తున్న రాజకీయాలపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడం పూర్తి చేసి దేశం పై పడ్డారని విజయశాంతి కేసీఆర్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఏపీ రాజకీయాల పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ పరిణామాలపై మాట్లాడిన విజయశాంతి ఏపీలో జనసేనను, జనసేన తో సానుకూలమైన బీజేపీని నష్టపరిచే ప్రయత్నం బీఆర్ఎస్ రూపం లో కెసిఆర్ చేస్తున్నట్టు ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ లోకి చేరికల పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయని విజయశాంతి పేర్కొన్నారు.

Vijayashanthi slams KCR that damaging Janasena and BJP in ap

తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే, ఏపీ ప్రజలను కూడా మోసం చేయొచ్చని, వాళ్లను నమ్మించగలుగుతా అని కెసిఆర్ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏది ఏమైనా ఏపీలో రాజ్యాధికార అర్హత కలిగిన అత్యంత బలమైన ఒక సామాజిక వర్గాన్ని బిజెపికి దూరం చేయటానికి కెసిఆర్ బిఆర్ఎస్ పేరుతో చేస్తున్న దుష్ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఏపీతోపాటు తెలంగాణలో రాజకీయంగా వెనక్కు నెట్టి వేయబడ్డ అన్ని వర్గాల సముదాయాలు అర్థం చేసుకుని కేసీఆర్ కుట్రలను, ఆయన రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని విజయశాంతి పేర్కొన్నారు.

ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసి, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ తీరు ఏపీ ప్రజలకి తెలియంది కాదని విజయశాంతి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు బీఆరెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం అంటూ విజయశాంతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బి ఆర్ ఎస్ ను ఆదరించేది లేదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+