Viral Video: తహసీల్దార్ ఆఫీస్‌లో రైతు ఆత్మహత్యాయత్నం

Viral Video: తమ సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు.. తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటూ ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మిడ్జిల్ తహసీల్దార్ కార్యాలయం సోమవారం ఈ తీవ్ర ఘటనకు సాక్ష్యంగా నిలిచింది.

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్చిల్ మండలం వాడ్యాల గ్రామానికి చెందిన గజ్జల కృష్ణయ్య అనే రైతు తన తల్లితో కలిసి సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. వారికి సర్వే నంబర్ 156లో 3 గుంటల పట్టా భూమి ఉందని.. దానికి సంబంధించిన పాస్ బుక్ కూడా తమ దగ్గర ఉన్నప్పటికీ.. కొందరు వ్యక్తులు తమను పొలంలోకి అడుగుపెట్టనివ్వడం లేదని తహసీల్దార్‌కు మొర పెట్టుకున్నారు. గత కొంతకాలంగా ఈ సమస్యతో సతమతమవుతున్న కృష్ణయ్య, అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

Viral Video Farmer Attempts Suicide at Tahsildar Office in Mahbubnagar

పురుగుల మందు తాగేందుకు యత్నం
తహసీల్దార్‌తో మాట్లాడుతుండగానే.. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు బాటిల్‌ను బయటికి తీసి, తాగేందుకు యత్నించారు. ఈ హఠాత్ పరిణామాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, అతని చేతిలోని పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన తర్వాత, తహసీల్దార్ రాజు గజ్జల కృష్ణయ్య సమస్యను వివరంగా అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ రాజు రైతులు ధైర్యం చెప్పి.. తమ పొలంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేకాకుండా, ఈ సమస్యను పరిష్కరించడానికి ఎస్సైతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటికే ఆందోళనలో ఉన్న రైతును సముదాయించి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కృష్ణయ్య, అతని తల్లి ప్రశాంతమయ్యారు.

రైతు కష్టాలకు అద్దం పడుతున్న ఈ ఘటన, ప్రభుత్వ రికార్డులలో భూమి యాజమాన్యం స్పష్టంగా ఉన్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను, వారి నిస్సహాయ స్థితిని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+