ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొన్న ఎంఎంటీఎస్: వైరల్ అవుతున్న వీడియో ఇదే
Recommended Video
హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర సోమవారం ఉదయం రెండు ఢీకొన్న విషయం తెలిసిందే. ఆగివున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ కేబిన్‌లో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు.

సుమారు 8గంటలపాటు శ్రమించిన సహాయక బృందాలు అతడిని బయటికి తీశాయి. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు కూడా గాయపడ్డారు.
కాగా, ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన స్థలానికి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజీనే ఇది.
#Kachiguda #MmtsTrain accident video pic.twitter.com/Xr6koJm5Vq
— syeraa (@syeraaupdates) November 11, 2019
ఆగివున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టిన ఎంఎంటీఎస్ రైలు వెనుక భాగం కాస్త పైకి లేచి పక్కకు ఒరిగింది. దీంతో ఎంఎంటీఎస్ రైలులో ఉన్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. రైలు దిగి బయటకు పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications