Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌...!!

విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ఘట్ కేసర్ దగ్గర పట్టాలు తప్పింది.

పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. హైదరాబాద్ నగర శివారులోని ఘట్ కేసర్ దగ్గర గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. కానీ, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం విశాఖలో బయల్దేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 6.15 గంటలకు నాంపల్లి చేరుకోవాల్సి ఉంది. గమ్యస్థానం చేరుకొనే క్రమంలో బీబీనగర్ వద్ద పట్టాలు తప్పంది. ఘట్ కేసర్- సికింద్రాబాద్ లైన్ లో అయిదు బోగీలు పట్టాలు తప్పాయి.

ఆ సమయంలో పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి. ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. బోగీలు పట్టాలు తప్పటంతో పలువురురు ప్రయాణీకులు కిందకు దూకేసార. ఆ సమయంలో స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. నిత్యం పూర్తి స్థాయి పర్యవేక్షణలో భదత్రా.. సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవటం పైన అధికారులు అప్రమత్తం అయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే సికింద్రాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్..ఆపరేషన్స్..ఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లారు. ఈ ఘటన చోటు చేసుకోవటానికి కారణాలపైన ఆరా తీస్తున్నారు.

Visakhapatnam to Hyderabad Godvari Express derailed near Ghatkesar, Delay in Trains Running

ఈ ఘటనతో సికింద్రాబాద్ - కాజీపేట మార్గంలో నిత్యం ప్రయాణించే రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు. ప్రయాణీకులు అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. పట్టాలపై నుంచి అయిదు బోగీలు పక్కకు ఒరిగినట్లుగా చప్పారు. పట్టాలు తప్పిన బోగీలను వదిలేసి మిగిలిన రైలు సికింద్రాబాద్ కు బయల్దేరింది. అయిదు బోగీల ప్రయాణీకులను ఇతర బోగీల్లో సర్దుబాటు చేసారు. ఈ ఘటన పైన విచారణ చేస్తన్నట్లు అధికారులు ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+