పక్కా ప్లాన్డ్‌గా అల్లు అర్జున్ అరెస్ట్..?
స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా, ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలోనే ల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
అయితే అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. తన నివాసంలోకి అకస్మాత్తుగా పోలీసులు వచ్చారని తెలిపారు. డైరెక్ట్‌గా తన బెడ్ రూమ్ లోకి వచ్చారని, ఆ సమయంలో దుస్తులు మార్చుకునే సమయం ఇవ్వాలని తాను కోరినట్లు తెలిపారు. కానీ అందుకు పోలీసులు ఒప్పుకోలేదని, అరెస్ట్ చేస్తున్నామని చెప్పారని అల్లు అర్జున్ చెప్పారు. డైరెక్ట్ బెడ్ రూమ్‌లోకి పోలీసులు వచ్చేస్తారా అని ప్రశ్నించారు.పోలీసులు తనను తీసుకెళ్లడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అప్పటికప్పుడు రావాలని చెబితే ఎలా అని అల్లు అర్జున్ నిలదీశారు.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ను కావాలనే శుక్రవారం అరెస్ట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం అరెస్ట్ చేస్తే శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కావడంతో , ఆయన రెండో రోజులు జైల్లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. అల్లు అర్జున్ విషయంలో పోలీసులు పక్కగా ప్లాన్ చేసి అరెస్ట్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకున్నారని , దీని వెనుక ఏదైన కుట్ర దాగి ఉందా అనుమానం అల్లు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications