వనిత క్యారెక్టర్ మంచిదికాదు, ఆధారాలు: నటుడు విజయ్ తండ్రి, 'ఆస్తి కోసం చంపుకున్నాడు'

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న నటుడు విజయ్ సాయి కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. విజయ్ సాయి భార్య వనితకు రెండు పేర్లు ఉన్నాయని ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. స్కూల్ సర్టిఫికేట్, పాస్ పోర్టులలో వేర్వేరు పేర్లు ఉన్నాయి. అంతేకాదు, తండ్రి పేరు కూడా వేర్వేరుగా గుర్తించారు.

ఆమె తల్లి రఫీ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందని గుర్తించిన పోలీసులు, ఆ దిశలోను విచారణ చేస్తున్నారు. అలాగే తన సూసైడ్ నోట్‌లో విజయ్ ఆరోపణలు చేసిన వారికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. తండ్రి పేరు మార్పు గురించి పోలీసులు వనితను విచారిస్తున్నారు.

నా కొడుకుతో గొడవల్లేవు

నా కొడుకుతో గొడవల్లేవు

ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి సుబ్బారావు, విజయ్ సతీమణి వనితల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విజయ్ చావుకు నువ్వు కారణమంటే నువ్వని చెబుతున్నారు. తన కొడుకు మృతికి వనిత కారణమని సుబ్బారావు ఆరోపించారు. తన కొడుకుకు, తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవని ఆయన స్పష్టం చేశారు. విజయ్ ఇప్పటికీ తనతో చాలా సంతోషంగా ఉండేవాడని చెప్పారు.

వనితపై అన్ని ఆధారాలు, సరైన టైంలో బయటపెడతా

వనితపై అన్ని ఆధారాలు, సరైన టైంలో బయటపెడతా

వనితకు సంబంధించి తమ వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని సుబ్బారావు చెప్పారు. సరైన సమయంలో ఆ ఆధారాలు బయటపెడతానని చెప్పారు. వనిత క్యారెక్టర్ మంచిది కాదని ఆరోపించారు. విజయ్ పిల్లల విషయంలో కోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. విడిపోయినప్పటి నుంచి తన కొడుకును వేధిస్తోందన్నారు. పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

సుబ్బారావు ఆరోపణలను ఖండించిన వనిత

సుబ్బారావు ఆరోపణలను ఖండించిన వనిత

మరోవైపు సుబ్బారావు ఆరోపణలను వనిత ఖండించారు. ఆస్తి కోసం కన్న కొడుకును చంపుకున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనను బలిపశువును చేసేందుకు విజయ్ తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు. తనకు ఏమీ తెలియదన్నారు.

ఆత్మహత్య తర్వాత పక్కా ప్లాన్‌తో నాపై నిందలు

ఆత్మహత్య తర్వాత పక్కా ప్లాన్‌తో నాపై నిందలు

కాగా, ఆదివారం మధ్యాహ్నం వరకు సంతోషంగానే ఉన్న విజయ్ రాత్రి ఎందుకు ఉరి వేసుకున్నారని వనిత ప్రశ్నించారు. ఒక స్థలం వ్యవహారంలో విజయ్‌కు, అతని తండ్రికి విభేదాలు ఉన్నాయని చెప్పింది. తండ్రి కారణంగానే అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. విజయ్ ఆత్మహత్య అనంతరం పక్కా ప్లాన్‌తో వారంతా తనపై నిందలు వేస్తున్నారని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+