వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బండి సంజయ్ కు వరంగల్ కమీషనరేట్ పోలీసుల అల్టిమేటం; పాదయాత్ర ఆపాలని నోటీసులు!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ వేయాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు బండి సంజయ్ కు పాదయాత్రను నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు.

కవితమ్మ తెలంగాణా బతుకమ్మ.. ఆమె జోలికొస్తే జరిగేదిదే: పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి శాపాలుకవితమ్మ తెలంగాణా బతుకమ్మ.. ఆమె జోలికొస్తే జరిగేదిదే: పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి శాపాలు

బండి సంజయ్ పాదయతను నిలిపివెయ్యాలని పోలీసుల నోటీసులు

బండి సంజయ్ పాదయతను నిలిపివెయ్యాలని పోలీసుల నోటీసులు

బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ధర్మ దీక్షకు దిగిన క్రమంలో పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లో బండి సంజయ్ పాదయాత్ర లో అడుగడుగున ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని నోటీసులో పేర్కొన్నారు.

బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తతలకు కారణం రెచ్చగొట్టే వ్యాఖ్యలే

బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తతలకు కారణం రెచ్చగొట్టే వ్యాఖ్యలే


జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైన నాటి నుండి అనేక ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. దేవరుప్పలలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జరిగిన ఘర్షణ, పాలకుర్తి సభ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్తత, ఆపై జనగామ లో ఫ్లెక్సీలతో రెండు పార్టీల మధ్య కొనసాగిన రాజకీయ రగడ నేపథ్యంలో ప్రజా సంగ్రామ పాదయాత్రలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని కూడా పోలీసులు భావిస్తున్నారు.

ధర్మదీక్షకు దిగిన బండి సంజయ్ ను అరెస్ట్ చేసింది అందుకే

ధర్మదీక్షకు దిగిన బండి సంజయ్ ను అరెస్ట్ చేసింది అందుకే


ఇక ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించిన బీజేపీ కార్యకర్తల పై దాడి చేయడాన్ని, కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కు పిలుపునిచ్చిన బండి సంజయ్, ఈ రోజు పాదయాత్ర కు బ్రేక్ వేసి బిజెపి కార్యకర్తల అరెస్టులకు నిరసనగా ధర్మ దీక్షకు దిగారు. అయితే బండి సంజయ్ నిర్వహించ తలపెట్టిన ధర్మదీక్ష అడ్డుకోవాలని పెద్ద ఎత్తున టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకునే క్రమంలో, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుందని గుర్తించిన పోలీసులు భారీగా మోహరించి బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.

పాదయాత్ర ఆపాలని వరంగల్ కమీషనరేట్ పోలీసుల అల్టిమేటం

పాదయాత్ర ఆపాలని వరంగల్ కమీషనరేట్ పోలీసుల అల్టిమేటం


ఆపై బండి సంజయ్ ను కరీంనగర్ కి తరలించి గృహ నిర్బంధం చేశారు. ఇక పాదయాత్ర నిలిపివేయాలని నోటీసులు జారీ చేసిన వరంగల్ పోలీసులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలను ఘర్షణలకు తరలించే ప్రయత్నం చేశారని నోటీసులో పేర్కొన్నారు. తమ ఆదేశాలను ధిక్కరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తానికి వరంగల్ కమిషనరేట్ పోలీసులు జారీ చేసిన అల్టిమేటం పై బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారు. బిజెపి ప్రజా సంగ్రామ పాదయాత్రను నిలుపుదల చేస్తుందా? లేక కోర్టును ఆశ్రయించి కొనసాగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

English summary
Warangal Commissionerate Police issued an ultimatum to Bandi Sanjay in the context of tensions during Bandi Sanjay's padayatra in the joint Warangal district. Notices were given to stop the praja sangrama padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X