Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘ఇట్స్‌ ఫన్నీ’: ఆశ్చర్యపర్చిన కలెక్టర్ ఆమ్రపాలి రిపబ్లిక్ డే ప్రసంగం

వరంగల్: యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వరంగల్ ఆర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కాటా 69వ గణతంత్ర దినోత్సవంలో వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గణతంత్ర దినోత్సవం రోజున ఎంతో హుందాగా సాగాల్సిన ఆమె ప్రసంగం అందుకు కొంత భిన్నంగా సాగింది. ప్రసంగం మధ్య మధ్యలో ఆమె నవ్వుతూ మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యానికి చేసింది.

ప్రసంగంలో నవ్వులు

ప్రసంగంలో నవ్వులు

గణతంత్ర వేడుకల్లో జెండా వందనం చేసిన తర్వాత కలెక్టర్ ఆమ్రపాలి తన ప్రసంగాన్ని కొనసాగించారు. జిల్లా అభివృద్ధి ప్రణాళిక, సాధించిన ప్రగతి గణాంకాలతో ఎంతో హుందాగా సాగాల్సిన ఆమె ప్రసంగం అకారణమైన నవ్వులతో సాగడం గమనార్హం.

కొంత తడబాటు..

కొంత తడబాటు..

శుక్రవారం హన్మకొండ పోలీసు పరేడ్ మైదానంలో ఆమ్రపాలి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం తెలుగులో ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రసంగ పాఠాన్ని చదువుతూ గణాంకాలు చెప్పే సందర్భంలో కొంత తడబాటుకు గురయ్యారు.

అభివృద్ధి బాటలో వరంగల్

అభివృద్ధి బాటలో వరంగల్

వరంగల్ జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తోందిన కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. ఓడీఎఫ్ జిల్లాగా మారుతోందని, పలు అవార్డులు కూడా వచ్చాయని చెప్పారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు.

ఇట్స్ ఫన్నీ..

ఇట్స్ ఫన్నీ..

కాగా, ఆమ్రపాలి తన ప్రసంగం మధ్యలో అకారణంగా నవ్వారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. వెనక్కి తిరిగి నవ్వేశారు. ‘ఇట్స్ ఫన్నీ' అని వ్యాఖ్యానించడం మైకులో వినిపించింది. కలెక్టర్ ప్రసంగం ఇలా సాగడంతో అక్కడివచ్చినవారు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు.

Recommended Video

    ఆమ్రపాలి ప్రేమ పెళ్లి వచ్చే నెలలోనే : వరుడు ఎవరో తెలుసా?
     సోషల్ మీడియాలో వైరల్‌గా..

    సోషల్ మీడియాలో వైరల్‌గా..

    కాగా, గణతంత్ర వేడుకల్లో ఆమ్రపాలి చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఆమ్రపాలి కాటాకు వచ్చే నెలలో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో వివాహం నిశ్చమైన విషయం తెలిసిందే.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+