సిటీలో వాషింగ్ పౌడర్ నిర్మా హోర్డింగులు: వెల్ కమ్ అమిత్ షా అంటూ!
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు ముందు హైదరాబాద్‌లో వెలిసిన పోస్టర్లు, హోర్డింగ్‌లు చర్చనీయాంశంగా మారాయి. వాషింగ్ పౌడర్ నిర్మా.. వెల్‌కమ్ టు అమిత్ షా అంటూ.. గుర్తుతెలియని వ్యక్తులు నగరవ్యాప్తంగా హోర్డింగ్‌లు ఏర్పాటుచేశారు.
నిర్మా సర్ఫ్‌తో బట్టలపై మరకలు మాయమై పోయినట్లు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరితే వారికి అంటిన మరకలు కూడా పోతాయని అర్థం వచ్చేలా అమిత్ షా పర్యటిస్తున్న మార్గాల్లో పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

నిర్మా అడ్వర్‌టైజ్‌లో కనిపించే అమ్మాయి తల ప్లేస్‌లో బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మ, నారాయణ్ రాణె, సువేందు అధికారి, సుజనాచౌదరి, జ్యోతిరాదిత్య సింధియా, ఈశ్వరప్ప సహా పలువురు నేతల ఫొటోలను ఉంచారు.
Welcome Amit Shah ! ! pic.twitter.com/J28jCJBU7p
— Krishank (@Krishank_BRS) March 12, 2023
కాగా, ఈ హోర్డింగులు, పోస్టర్లను పలువురు బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వెల్ కమ్ అమిత్ షా అంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా బైబై మోడీ అంటూ హైదరాబాద్‌తోపాటు ఢిల్లీలో శనివారం పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications