మరో ఇద్దరి సభ్యత్వాలు రద్దా? ఈ రోజే సంచలన ప్రకటన: తేల్చేసిన కోమటిరెడ్డి

Subscribe to Oneindia Telugu
  రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు సిద్ధం

  హైదరాబాద్: ఈ రోజు సంచలన నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయడంతో మంగళవారం రాత్రి నుంచి ఎమ్మెల్యే సంపత్ తోపాటు కోమటిరెడ్డి 48గంటల దీక్షను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

  రాజీనామాలకు సిద్ధం

  రాజీనామాలకు సిద్ధం

  ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గజ్వేల్‌లో తాను పర్యటించినందుకే కేసీఆర్ తనపై కక్ష పెంచుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

  నిరూపించండి! రాజీనామా చేస్తా, ఆ 17ని. ఏం చేశారు?: కోమటిరెడ్డి సవాల్

  రాహుల్‌కీ చెప్పాం

  రాహుల్‌కీ చెప్పాం

  రాజీనామాల అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా సమాచారం ఇచ్చామని కోమటిరెడ్డి తెలిపారు. ఏఐసీసీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని కోమటిరెడ్డి తెలిపారు. త్వరలోనే రాహుల్ గాంధీతో మహబూబ్ నగర్, నల్గొండలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు.

  ఉప ఎన్నికలకు సిద్ధం

  ఉప ఎన్నికలకు సిద్ధం

  కాంగ్రెస్ సభ్యులు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని కోమటిరెడ్డి అన్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తే మిగితా సభ్యులు అసెంబ్లీలో ఉండే ఏం చేస్తారని ప్రశ్నించారు. అందుకే అందరం రాజీనామాలు చేసి ప్రజా క్షేత్రంలోకి వెళ్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

  మరో ఇద్దరి సభ్యత్వాలు రద్దు?

  మరో ఇద్దరి సభ్యత్వాలు రద్దు?

  ఇది ఇలా ఉండగా, మండలిలో హెడ్ ఫోన్స్ విసిరింది నలుగురు ఎమ్మెల్యేలని వీడియో ఫుటేజీ చూసిన అసెంబ్లీ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరో ఇద్దరిపైనా బహిష్కరణ వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

  కాంగ్రెస్ న్యాయ పోరాటం

  కాంగ్రెస్ న్యాయ పోరాటం

  రాంచందర్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిల సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిపై బుధవారం అసెంబ్లీలో తీర్మానం పెట్టే అవకాశం ఉంది. కాగా, సభ్యత్వాల రద్దు, సస్పెన్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతోంది. బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress MLA Komatireddy Venkat Reddy on Wednesday said that their party MLAs will ready to resign.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి