Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో తీవ్ర వడగాలులు: హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, వడగాలులు కొనసాగుతున్నాయి. తాజాగా, భారత వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో మే 4వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ మేరకు అప్రమత్తం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి , నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో బుధవారం వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Weather alert Heat wave in telangana districts till may 4th

మే 2న హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

మరోవైపు, శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇది ఇలావుండగా, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌లో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం.. సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయని తెలిపింది. నల్గొండ, ములుగు జిల్లాల్లో 45 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. మరోవైపు, హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+