హైదరాబాద్‌లో మళ్లీ వర్షం: తెలంగాణ వ్యాప్తంగా మరో రెండ్రోజులపాటు వానలే

హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్: గత మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో భారీ పంట నష్టం చోటు చేసుకుంది. చేతికివచ్చిన పంటలు అకాల వర్షాలతో పాడవడంతో రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. కాగా, మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో మరింత ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక, మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం చాలా చోట్ల ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Weather: Two more days rains in telangana districts: heavy rain in Hyderabad

రాగల మూడు గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నార్త్ హైదరాబాద్ ప్రాంతంలో వర్షం మొదలైంది. ముఖ్యంగా పటాన్ చెరువు, అమీన్ పూర్, బాచుపల్లి, కొంపల్లి, కండ్లకొయ్య, మేడ్చల్, గండి మైసమ్మ, దుండిగల్‌లో వర్షం పడుతోంది. రానున్న గంట, రెండు గంటల్లో అన్ని ప్రాంతాలకు వాన విస్తరించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందినప్పటికీ.. ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+