వెదర్ అప్‌డేట్: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈ జిల్లాలకు అలర్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోను పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. తాజాగా, వాతావరణ శాఖ వర్ష సూచనలు చేసింది. రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి బారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. అలాగే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, భువనగిరి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

మంగళ, బుధవావారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, హైదరాబాద్, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
బుధ, గురువారాల్లో మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ జారీ చేసింది.
ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జీల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications