Rain: తెలంగాణ ఎన్నికల రోజున ఈ ప్రాంతాల్లో వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య భారతదేశంతోపాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనున్న గురువారం (నవంబర్‌ 30న) రోజున దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు ఐఎండీ అలర్ట్‌ జారీ చేసింది. బుధవారం హైదరాబాద్ నగరంలో వాతావరణం చల్లగా మారిపోయింది.

 weather update; normal to moderate rains in telangana districts for next two days

కాగా, రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 5.1 సెం.మీ.లు, నిజామాబాద్‌ నార్త్‌లో 4.35 సెం.మీ.లు, నిజామాబాద్‌లో 3.93 సెం.మీ.లు, నిజాంపేటలో 3.58 సెం.మీ.లు, కల్దుర్తి, గోపన్‌పల్లిలలో 3.45 సెం.మీ.లు, చిన్నమావంధిలో 3.15 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

ఏపీలో భారీ వర్షాల అలర్ట్
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది నవంబరు 30 నాటికి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. డిసెంబరు 2 కల్లా నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తుపానుగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబరు 3న రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

గరిష్ఠంగా 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో డిసెంబరు 2 నుంచి 4 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబరు 30 కల్లా తిరిగొచ్చేయాలని వాతావరణ హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+