హైదరాబాద్‌లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్: ఇంకొన్ని గంటల్లో: ఆ రెండింటి మధ్య తేడా ఇదే..!!

హైదరాబాద్ లో ఫార్ములా-ఈ రేస్ కు సర్వం సిద్ధమైంది. శనివారం ఈ ప్రిక్స్ ప్రారంభం కానుంది. ఇవ్వాళ ప్రీ ప్రాక్టిస్ జరిగాయి.

హైదరాబాద్: దేశంలో మొట్ట మొదటిసారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఇది. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం వినియోగిస్తారు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్‌లల్లో మాత్రమే ఈ ఫార్ములా-ఈ రేసింగులు నడుస్తున్నాయి. వాటి సరసన హైదరాబాద్‌కు కూడా చేరింది.

2.3 సర్క్యుట్ కిలోమీటర్లు..

2.3 సర్క్యుట్ కిలోమీటర్లు..

రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. తొలిసారిగా స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ ఇది. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.3 కిలోమీటర్ల సర్క్యుట్ ఓవర్‌ లుకింగ్‌పై ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్‌ను నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ పార్క్, సంజీవయ్య పార్క్ మీదుగా ఈ రేస్ సాగుతుంది. రేస్ నడుస్తోన్న సమయంలో అవసరమైన పిట్‌ స్టాప్స్, ప్రేక్షకులు తిలకించడానికి వీలుగా సీటింగ్, ఫెన్సింగ్ నిర్మాణం అన్నీ పూర్తయ్యాయి.

18 మలుపులు..

18 మలుపులు..

మొత్తం 18 మలుపులతో ట్రాక్ ను నిర్మించారు. శనివారం ఈ గ్రాండ్ ప్రిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవ్వాళ ఫ్రీ ప్రాక్టీస్ సెషన్ జరిగింది. ఇవ్వాళ అసలు గ్రాండ్ ప్రిక్స్ ఆరంభమౌతుంది. నెక్లెస్ రోడ్ పై గరిష్ఠంగా 320 కిలోమీటర్ల స్పీడ్ తో ఎలక్ట్రిక్ రేసింగ్ కార్లు దూసుకెళ్లనున్నాయి. పైగా ఇది స్ట్రీట్ రేసింగ్.

ఫార్ములా 1 కంటే..

ఫార్ములా 1 కంటే..

సాధారణంగా ఫార్ములా 1 రేసింగ్స్ లో హైబ్రిడ్ టర్బో ఛార్జ్డ్ ఇంజిన్ లతో కూడిన కార్లను వినియోగిస్తుంటారు. ఇది భిన్నం. బ్యాటరీ ఆధారంగా నడిచే కార్లను ఇందులో వాడుతున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంలో భాగంగా కోసం ఫార్ముల ఈ రేస్ లో ఎలక్ట్రిక్ కార్లను వినియోగిస్తారు. ఫార్ములా ఈ అనే పేరు పెట్టడానికి కూడా ఇదే ప్రధాన కారణం. ఈ సారి కొత్తగా థర్డ్ జనరేషన్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు.

థర్డ్ జెన్ రేసింగ్ కార్లు..

థర్డ్ జెన్ రేసింగ్ కార్లు..

థర్డ్ జనరేషన్ టెక్నాలజీతో రూపొందించిన ఎలక్ట్రిక్ కార్లను ఫార్ములా ఈ రేసింగ్ కోసం వినియోగిస్తోన్నారు. ఫార్ములా 1తో పోల్చుకుంటే ఇవి అత్యంత తేలికగా ఉంటాయి. మెరుపు వేగంతో దూసుకెళ్తాయి. గరిష్ఠంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి ఇవి. 2018-2022 మధ్య నిర్వహించిన రేసింగ్ లో వినియోగించిన కార్ల గరిష్ఠ వేగం 280 కిలోమీటర్లే. ఈ సారి ఈ సంఖ్య 320 కిలోమీటర్ల కు చేరింది.

ఫార్ములా-ఈ తొలి రేసులో..

ఫార్ములా-ఈ తొలి రేసులో..

గతంలో 2014-17 మధ్యకాలంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో వాడిన కార్ల బ్యాటరీ నుంచి 200కిలో వాట్ల పవర్ ప్రొడ్యూస్ అయ్యేది. ఫలితంగా రేస్ మధ్యలో ఉన్నప్పుడు డ్రైవర్లను కార్లను మార్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి దాదాపుగా లేనట్టే. తాజాగా వినియోగిస్తోన్న కార్లల్లో ఉండే బ్యాటరీలు 350 కిలోవాట్ల విద్యుత్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. బ్యాటరీ రీఛార్జ్ కావడానికి బ్రేక్ వేస్తే చాలు. బ్రేక్ వేసినప్పుడు 40 శాతం ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. అది బ్యాటరీని రీఛార్జ్ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+