హైదరాబాద్‌లో "మాక్ డ్రిల్స్" జరిగేది ఎక్కడెక్కడంటే..?

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల పర్యాటకులపై చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు సమర్థంగా స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సెక్యూరిటీ వ్యవస్థను పరీక్షించేందుకు కీలక చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జూన్ 6న దేశ వ్యాప్తంగా మాస్ మాక్ డ్రిల్స్ (భద్రతా విన్యాసాలు) నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 259 కీలక ప్రదేశాల్లో విన్యాసాలు నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. వీటిని ముప్పు తీవ్రత ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించగా.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం నగరాలను ఎంపిక చేసి కేటగిరీ-2లో చేర్చింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో మంగళవారం జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో ఈ విన్యాసాలకు తుది రూపం ఇచ్చారు.

where-do-mock-drills-take-place-in-hyderabad

అంతే కాకుండా హైదరాబాద్‌లో నాలుగు ప్రధాన కేంద్రాల్లో విన్యాసాలు జరగనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ విన్యాసాలు సాయంత్రం 4 గంటలకు నగరంలోని ఆ నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించనున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు భారీ భద్రతా దళాల కదలికలు, అలజడి, సైరన్‌లు, హెలికాప్టర్ల గర్జనలు వంటి దృశ్యాలను గమనించవచ్చు. అయితే ఇది ఇది కేవలం మాక్ డ్రిల్ మాత్రమే అని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.

హైదరాబాద్ లో మాక్ డ్రిల్ జరిగే ప్రాంతాలు..

సికింద్రాబాద్ కంటోన్మెంట్

గోల్కొండ

DRDO కార్యాలయం - కంచన్‌బాగ్

NFC - మౌలాలి

మాక్ డ్రిల్స్ ప్రధాన లక్ష్యాలు..

ఉగ్రదాడులపై పౌరులలో అప్రమత్తత పెంచి.. తక్షణ స్పందనపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. అలానే పలు భద్రతా శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం.. సమయానికి స్పందించే సామర్థ్యంపై శిక్షణ ఇవ్వడం ఇందులో భాగమని అంటున్నారు. మరోవైపు విన్యాసాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రయాణించే వారు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలు ప్రణాళిక చేసుకోవాలని వెల్లడించారు. ఆ సమయంలో డ్రోన్‌లు ఉపయోగించకూడదని.. వీడియోలు తీసేందుకు ప్రయత్నించొద్దన్నారు. పోలీసులు, భద్రతా సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+