కొండా సురేఖ రీఎంట్రీపై తేల్చేసిన బీఆర్ఎస్..! రాజగోపాల్ పైనా ..!

అనూహ్య పరిణామాల మధ్య రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి మంత్రిగా బర్తరఫ్ అయిన కొండా సురేఖ (Konda Surekha).. తదుపరి అడుగులు ఎటువైపు అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి. కూతురు చేసిన వ్యాఖ్యల పర్యవసానంగా మంత్రి పదవి కోల్పోయిన కొండా సురేఖ తాను కాంగ్రెస్ లోనే ఉంటానని పైకి చెప్తున్నా.. లోలోపల చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో విపక్ష బీఆర్ఎస్ (BRS) లోకి ఆమె వెళ్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ దిశగా బీఆర్ఎస్ నేతలు రీఎంట్రీ కోసం ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి స్పందించారు.

 రేవంత్ తో ఇక అమీ తుమీ , ఢిల్లీలో తేల్చేసిన సురేఖ - వేటు పడితే ఆ వెంటనే..!!
రేవంత్ తో ఇక అమీ తుమీ , ఢిల్లీలో తేల్చేసిన సురేఖ - వేటు పడితే ఆ వెంటనే..!!

కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి తీసుకునే ఆలోచన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి తీసుకునే ఆలోచన తమకు లేదని , తమ వైపు నుంచి ఆ ప్రయత్నం కూడా లేదని ఆయన స్పష్టత ఇచ్చేశారు. సురేఖను పార్టీలోకి తీసుకునే అంశంపై బీఆర్ఎస్‌ నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలను కొండా సురేఖ ఆధారాలతో సహా బయటపెడుతున్నారని, తప్పకుండా దీనిపైన విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు బర్తరఫ్ చేయాల్సింది రేవంత్ రెడ్డిని అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Will BRS Take Back Konda Surekha Jagadish Reddy Breaks Silence After Cabinet Exit
 పంతం నెగ్గించుకున్న రేవంత్ - సురేఖ, చిన్నారెడ్డి ఔట్:ఆ స్థానాల్లో వీరు నియామకం..!!
పంతం నెగ్గించుకున్న రేవంత్ - సురేఖ, చిన్నారెడ్డి ఔట్:ఆ స్థానాల్లో వీరు నియామకం..!!

దొంగని వదిలేసి దొంగతనం చేసిండు అని చూపించిన వాళ్లని అరెస్ట్ చేసే సంస్కృతి కనిపిస్తుందంటూ తాజా పరిణామాలపై జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీలోకి రానివ్వబోమన్నారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు తాకనివ్వమని, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని తప్ప ఎవరిని తీసుకోమని కూడా చెప్పేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు బీఆర్ఎస్‌లోకి రావడానికి రెడీగా ఉన్నారని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకోబోమని జగదీష్ తెలిపారు. ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ బీఆర్ఎస్‌లోకి వస్తామంటే తీసుకోలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+