పంతం నెగ్గించుకున్న రేవంత్ - సురేఖ, చిన్నారెడ్డి ఔట్:ఆ స్థానాల్లో వీరు నియామకం..!!

తెలంగాణ ప్రభుత్వం.. కాంగ్రెస్ లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. కొద్ది రోజులుగా చర్చ గా మారిన కొండా సురేఖ.. చిన్నారెడ్డి పైన వేటు పడింది. కొండా సురేఖ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసారు. చిన్నారెడ్డిని పదవి నుంచి తప్పించారు. వీరి స్థానంలో నియామకాలు పూర్తి చేసారు. కొండా సురేఖ బీసీ కార్డు తెర పైకి తెచ్చిన వేళ.. చిన్నారెడ్డి పైనా వెంటనే వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నియామకాల పైనా పార్టీలో చర్చ మొదలైంది.

సీఎం రేవంత్ తాను అనుకున్నదే చేసారు. తన పైన కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలను సీఎం సీరియస్ గా తీసుకున్నారు. కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను ఖండించకపోవటం పై ఆగ్రహం తో ఉన్నారు. దీంతో.. పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ కు మద్దతుగా సురేఖ పైన చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేసారు. కాగా.. తరువాత చేసుకున్న పరిణామాలతో కొండా సురేఖ ఢిల్లీలో పార్టీ పెద్ద లతో చర్చలు చేసారు. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో, సురేఖ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డిని పదవి నుంచి తప్పించారు. తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి ఆయన్ను తప్పించారు.

 మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - ఇక ఆ పార్టీ వైపే అడుగులు..!!
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - ఇక ఆ పార్టీ వైపే అడుగులు..!!
cm-revanth-s-move-shakes-congress-as-konda-surekha-and-chinna-reddy-removed-full-report-here

వారిని తప్పిస్తూనే కీలక నియామకాలు

కొండా సురేఖ తన పైన చర్యల సమయంలో బీసీ కార్డు తెర మీదకు తెచ్చారు. దీంతో.. చిన్నారెడ్డి పైనా చర్యలు వెంటనే తీసుకున్నారు. ఇదే సమయంలో బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ వీరి స్థానం లో కొత్త నియామకాలు చేపట్టారు. చిన్నారెడ్డి స్థానంలో సీనియర్ నేత కేకే కుమార్తె గద్వాల విజయ లక్ష్మికి ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సురేఖ ను బర్తరఫ్ చేయటం తో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిని కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) ఛైర్ పర్సన్ గా నియమించారు. ఇక.. సురేఖ స్థానంలో కేబినెట్ లోకి బీసీ వర్గానికి చెందిన మహిళకు అవకాశం ఇవ్వనున్నారు. ఈ స్థానంలో కొత్త మంత్రి గా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి గా మారింది. ఇక.. ఢిల్లీ కేంద్రంగా జరిగిన చర్చల్లో వీరిద్దరి పైనా చర్యలు తీసుకోవాలని రేవంత్ పట్టు బట్టినట్లు తెలుస్తోంది. ఫలితంగా హైకమాండ్ ఆమోదంతో వేటు వేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+