జీహెచ్ఎంసీ, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్డు కూల్చేస్తారా? హైడ్రాకు సూటిప్రశ్న!

హైదరాబాద్ లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తాజాగా హైదరాబాద్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఎవరు అడ్డొచ్చినా మూసి ప్రక్షాళన ఆగదని, మూసి సుందరీకరణ చేసి తీరుతామని వెల్లడించిన క్రమంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేశారు.

వాటిని కూల్చేస్తారా... ఓవైసీ ప్రశ్న
ఎఫ్ టి ఎల్ పరిధిలోను, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న భవనాలను కూల్చేస్తామని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ భవనాలను కూడా ఎఫ్డిఎల్ లో కట్టారని వాటిని కూడా కూల్చేస్తారా అంటూ ప్రశ్నలు సంధించారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్డిఎల్ పరిధిలో ఉందని, దాన్ని తొలగిస్తారా అంటూ ప్రశ్నించారు.

Will GHMC Secretariat be demolished asaduddin owaisi Direct question to Hydra

సెక్రటేరియట్ తో పాటు ప్రముఖుల ఘాట్ లు ఎఫ్టీఎల్ పరిధిలోనే
ఇక జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం కూడా ఎఫ్డిఎల్ పరిధిలోనే ఉందని, సెక్రటేరియట్ , ప్రముఖుల ఘాట్ లు అన్ని ఎఫ్డిఎల్ పరిధిలోనే ఉన్నాయని వాటిని కూల్చేస్తారా అంటూ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. సెక్రటేరియట్ ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉంటే లేని ఇబ్బంది పేదల ఇల్లు ఉంటే వచ్చిందా అంటూ ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

అభివృద్ధికి మద్దతిస్తాం కానీ
అభివృద్ధికి తాము మద్దతు ఇస్తామని, కానీ పేదలను ఇబ్బంది పెట్టొద్దని అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ముస్లిం మైనారిటీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడిన ఆయన బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కనుసన్నల్లో నడుస్తుందని సంచలన ఆరోపణలు చేశారు .

బీజేపీని టార్గెట్ చేసిన ఓవైసీ
వక్ఫ్ బోర్డ్ విషయంలో బిజెపి అసత్య ప్రచారాలు చేస్తుందని, ట్రిపుల్ తలాక్, సిఏఏ లాంటి చట్టాలను తెచ్చారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న, జరగనున్న ఎన్నికలలో బిజెపి ఓటమి ఖాయమని అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. మహారాష్ట్ర, కాశ్మీర్, హర్యానాలలో బిజెపి ఓడిపోతుందన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాలు వినే ఉద్దేశం లేకనే తాను పార్లమెంటుకు వెళ్లడం లేదని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.

హైడ్రా వ్యవస్థ పైన వ్యాఖ్యలు చేస్తున్న ఓవైసీ
ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఆస్తులు చాలావరకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని పేర్కొని, వాటిని కూల్చివేయాలని పెద్దఎత్తున బీజేపీ నుండి డిమాండ్ వినిపిస్తున్న క్రమంలో ఆయన హైడ్రా వ్యవస్థ పైన పదేపదే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+