Rythu Runa Mafi: రైతు రుణ మాఫీ సాధ్యం అవుతుందా..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు రుణ మాఫీ హామీ ఇచ్చింది. రూ.2 లక్షల రుణ మాఫీ ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే నిజంగానే రుణ మాఫీ సాధ్యం అవుతుందా, ప్రభుత్వం వద్ద అంత డబ్బు ఉందా అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని ఘంటపథంగా చెబుతున్నారు.
రైతులకు హామీ ఇచ్చామని.. హామీని కచ్చితంగా అమలు చేసి తీరుతామని రేవంత్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పెద్దతల్లి సాక్షిగా రుణ మాఫీ చేస్తామని రేవంత్ కుండలు బద్దలు కొట్టారు. అయితే రుణ మాఫీ పొందే రైతులను గుర్తించాలంటే 4 నెలల సమయం పడుతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రుణ మాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణ మాఫీకే నిధులు కేటాయిస్తే ఇతర పథకాలకు నిధులు కొరత ఉండే అవకాశం ఉంది.

ప్రభుత్వం రైతు రుణ మాఫీ క్లారిటీగా ఉంది. రుణ మాఫీ కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఆ కార్పొరేషన్ కు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొస్తామని వివరిస్తోంది. తీసుకొచ్చిన డబ్బుతో రైతు రుణ మాఫీ చేస్తామని చెబుతోంది. ఆ తర్వాత బ్యాంకు రుణాలు క్రంగా తీరుస్తామని పేర్కొటోంది.
బీఆర్ఎస్ రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని చెప్పి ఐదేళ్లలో అందరికి చేయలేదని.. కాంగ్రెస్ మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రైతు రుణ మాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే ఆరునూరైన రుణ మాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్ట్ 15 లోపు రుణ మాఫీ అవుతుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications