సీఎం రేవంత్ రెడ్డికి విషెస్; ఎమ్మెల్సీ రేసులో బండ్ల గణేష్?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత రేవంత్ రెడ్డి వీరాభిమాని అయిన టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసే వరకు ఎల్బీ స్టేడియంలోనే పడుకుంటాను అని సంచలన వ్యాఖ్యలు చేసి, అక్కడే ఉన్న విషయం తెలిసిందే.

అంతే కాదు రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తానని కూడా ఆయన ప్రకటన చేశారు. ఇక తాజాగా ఈరోజు రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ ప్రొడ్యూసర్, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ రేవంత్ రెడ్డిని కలిసి ఒక మొక్కను అందించి విషెస్ తెలిపారు. తెలంగాణ సీఎంను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఐదేళ్లలో రేవంత్ రెడ్డి చేపట్టబోయే పథకాలన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Wishes to CM Revanth Reddy.. Is Bandla Ganesh in MLC race? discussion

అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షించిన ఆయన రేవంత్ రెడ్డి పై విపరీతమైన అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా సినీ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాలలో యాక్టివ్ అవుతారని ఆసక్తికర చర్చ జరుగుతుంది. బండ్ల గణేష్ ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొంతకాలంగా కాంగ్రెస్ కు గట్టిగానే బాకా ఊగుతున్న బండ్ల గణేష్ ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నట్లు గా ప్రచారం జరుగుతుంది. ఇక బండ్ల గణేష్ విషయంలో రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు చాలా రోజులుగా ఖాళీగా ఉండగా ఈ సీటులో బండ్ల గణేష్ కు అవకాశం ఇస్తారని చర్చ జరుగుతుంది.

అయితే అలాంటి అవకాశం లేదని మరికొందరు అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులే చెప్పాలి. ఏది ఏమైనా బండ్ల గణేష్ ఇటీవల కాలంలో రాజకీయాలపై బాగానే ఫోకస్ చేస్తున్నారు.ముఖ్యంగా రేవంత్ రెడ్డి భజన బాగానే చేస్తున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+