తల్లిని చంపిన భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్యలు!

ఇటీవల కాలంలో భార్యలు భర్తలను హత మారుస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. కొంతమంది భార్యలు వివాహేతర సంబంధం పెట్టుకుని, భర్తలను అడ్డు తప్పించుకోవటం కోసం హతమారుస్తుంటే, కొంతమంది భార్యలు భర్తల వేధింపులు భరించలేక వారిపై ఎదురు తిరిగి వారి ప్రాణాలు తీస్తున్నారు.

భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్యలు
తాజాగా అటువంటి ఘటనే జనగామ జిల్లాలో లింగాల గణపురం మండలం ఏనబావి గ్రామ శివారు పిట్టలోని గూడెంలో చోటు చేసుకుంది. భర్తను ఇద్దరు భార్యలు గొడ్డలితో నరికి చంపిన ఘటన చోటు చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక ఇద్దరు భార్యలు భర్తను గొడ్డలితో హతమార్చారు. జనగామ జిల్లాలో కాలియా క‌నక‌య్య అనే వ్య‌క్తిని అత‌ని భార్య‌లే గొడ్డ‌లితో న‌రికి చంపారు.

Wives hack husband to death with axe after killing mother in jangaon district

అత్తను చంపి జైలుకు వెళ్లి వచ్చిన భర్త
వివ‌రాల్లోకి వెళితే 30 ఏళ్ల వయసు ఉన్న కాలియా క‌నుక‌య్య‌కు ఇద్ద‌రు భార్య‌లు. అక్క కూతుర్లు, సొంత అక్కా చెల్లెళ్ళు అయిన శిరీష (21) గౌర‌మ్మ (19)ల‌ను క‌నక‌య్య పెళ్లి చేసుకున్నాడు.అయితే గ‌త మే నెల 18న కాలియా క‌నుక‌య్య త‌న అత్త అంటే శిరీష‌, గౌర‌మ్మ‌ల త‌ల్లి గుగులోతు జున్నుబాయిని యాదాద్రి జిల్లా మామిడితోట‌లో హతమార్చాడు. కొంత కాలం జైలు జీవితం గడిపి బెయిల్ పై బయటకు వచ్చాడు.

తల్లిని చంపాడని, భర్తతో వెళ్ళని భార్యలు.. హత్యాయత్నం చేసిన భర్త
త‌ల్లి చ‌నిపోయిన‌ప్ప‌టి నుండి అత‌ని భార్య‌లు శిరీష ,గౌర‌మ్మ‌లు భ‌ర్త‌తో వెళ్ల‌కుండా త‌ల్లిగారి ఇంటి వ‌ద్దే ఉంటున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే జైలునుంచి వ‌చ్చిన క‌నుక‌య్య త‌ర‌చుగా పిట్ట‌లోని గూడెం వ‌స్తూ తాగి భార్య‌ల‌ను బెదిరిస్తున్నాడు. ఈ నేప‌ధ్యంలో సోమ‌వారం రాత్రి య‌థావిధిగా బాగా తాగి పిట్ట‌ల‌గూడెం చేరుకున్న క‌నుక‌య్య గొడ్డ‌లి తీసుకొని భార్య‌ల‌పై దాడికి ప్ర‌య‌త్నిం చాడు.

గొడ్డలి లాక్కుని నరికి చంపిన భార్యలు
దీంతో ఇద్ద‌రు అక్కా చెల్లెళ్ళు క‌లిసి గొడ్డ‌లి లాక్కుని భ‌ర్త‌ను న‌రికి చంపారు. ఆపై కనకయ్య మృతదేహాన్ని దేవాదుల కాలువలో పడేశారు. ఈ ఘ‌ట‌నతో గ్రామంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తను హతమార్చిన భార్యలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+