బిగ్ ట్రాప్.. శారీరకంగా దగ్గరై... ఆ వీడియోలు లీక్ చేస్తానని బ్లాక్‌మెయిల్...

కొత్తగూడెం పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ మహిళ చాలాకాలంగా నివసిస్తోంది. ఈజీ మనీకి అలవాటుపడిన ఆమె ఆర్థికంగా కాస్త స్థితిమంతులైనవారికి గాలం వేయడం మొదలుపెట్టింది. మొదట మంచి మాటలతో వారికి దగ్గరై.. ఆ తర్వాత శృంగారపరంగా వారిని రెచ్చగొట్టేది. అలా వారిని శారీరకంగా లొంగదీసుకునేది. ఆ తతంగమంతా రహస్యంగా వీడియో చిత్రీకరించేది. ఇవేమీ తెలియని అమాయకులు ఆమె తమకు దగ్గరైందని మురిసిపోయేవారు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని షాక్ తినేవారు.

ఎవరా మహిళ...

బుట్టలో పడ్డ బడా వ్యాపారి...

బుట్టలో పడ్డ బడా వ్యాపారి...

ఇదే క్రమంలో ఇటీవల పట్టణంలోని శాస్త్రిరోడ్‌కు చెందిన ఓ బడా వ్యాపారిని ఆమె బుట్టలో వేసుకుంది. ఆమె అసలు స్వరూపం తెలియక ఆ వ్యాపారి ఆమెను పలుమార్లు కలిశాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె రహస్యంగా వీడియోలు చిత్రీకరించింది. ఆ తర్వాత కొద్దిరోజులకు అతనికి ఫోన్ చేసి బ్లాక్‌మెయిల్ మొదలుపెట్టింది. రూ.10లక్షలు ఇవ్వాలని లేదంటే వీడియో లీక్ చేస్తానని బెదిరించింది. ఇల్లందు,పాల్వంచలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మధ్యవర్తులుగా అతనితో డీలింగ్ నడిపింది.

ఎట్టకేలకు అరెస్ట్...

ఎట్టకేలకు అరెస్ట్...

అయితే అంత డబ్బు ఇచ్చేందుకు సదరు వ్యాపారి నిరాకరించాడు. ఏం చేయాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.ఆమె సెల్‌ఫోన్‌ డేటాను పరిశీలించగా... అందులో పలు వీడియోలు కనిపించాయి. సదరు వ్యాపారితో పాటు మరికొందరిని కూడా ఆమె ఇలాగే బలి చేసిందని గుర్తించారు. అందులో కేటీపీఎస్‌లో పనిచేసే ఓ ఉన్నత స్థాయి అధికారి,ఓ ఉద్యోగి కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె బాధితులు మొత్తం ఎంతమంది... ఎవరెవరి నుంచి ఎంత డబ్బు కాజేసిందన్న దానిపై కూపీ లాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+