విధవను వంచించి గర్భవతిని చేసిన వార్డు సభ్యుడు

ఆదిలాబాద్: భర్త చనిపోయిన ఓ మహిళను ఓ వార్డు స భ్యుడు వంచిచాడు. తన మాయమాటలతో న మ్మించి, గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో, చేతులెత్తేసి ఎనిమిది నెలల స మయంలో అబార్షన్ చేయించినట్లు తెలిసింది.

వివరాలు ఇలా ఉన్నాయి - ఆసిఫాబాద్ డివిజన్‌లోని ఓ మండలానికి చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంతో తన భర్తను కోల్పోయింది. ఆమెను పెళ్లిచేసుకుంటానని ఓ వార్డు సభ్యుడు నమ్మించాడు. వివాహేతర సంబంధం కొనసాగించి, గర్భవతిని చేశాడు. గర్భం ధరించి ఎనిమిది నెలలైనా పెళ్లి మాట ఎత్తకపోవడంతో, ఆ మహిళ అతన్ని నిలదీసింది.

 woman cheated by a ward member in adilabad district

దీంతో చేతులెత్తేసిన అతగాడు, ఓ మధ్యవర్తి ద్వారా గర్భం తొలగింకోవాలని ఒత్తిడి చేసి, కొంత మొత్తం ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదర్చుకున్నాడు. తాజాగా కాగజ్‌నగర్ ఏరియాలోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించి, జారుకున్నాడు.

తెల్లవారే సరికి ఈ విషయం బయటకు పొక్కగా, సదరు వైద్యులు ఏమీ లేదని చెప్పినట్లు తెలిసింది. గతంలో కూడా ఆ వార్డు సభ్యుడు పలువురు మహిళలతో ఇలాగే ప్రవ ర్తించినట్లు సమాచారం. బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఫిర్యాదు చేయలేదని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+