అక్కా అంటూ ఫేస్‌బుక్ స్నేహం, అభ్యంతరక పోస్టులతో మహిళా ప్రొఫెసర్‌కు వేధింపు

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: అక్కా అంటూ ఫేస్‌బుక్‌లో ఓ సామాజిక కార్యకర్తతో స్నేహం చేసుకొని ఆమెను వేధించిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. బాధితురాలు ఈ మేరకు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బుధవారం వెలుగుచూసింది.

ఓ మహిళా ప్రొఫెసర్ ఓ ఫౌండేషన్ పేరుతో మహిళల సాధికారత కోసం పని చేస్తున్నారు. ఆమె పైన నిందితుడు అభ్యంతరకర పోస్టులను సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో పెట్టారు.

నిందితుడు నెల రోజులుగా అసభ్యకర పోస్టులతో సదరు మహిళా ప్రొఫెసర్‌ను వేధిస్తున్నారు. నిందితుడి పేరు సోషల్ మీడియాలో దుర్గా డాన్‌గా ఉంది. నిందితుడు దుర్గా డాన్ పైన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 Woman harassed by facebook friend

నిందితుడు బాధితురాలికి పలుమార్లు ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టారు. అక్కా అంటూ ప్రాధేయపడ్డాడు. ప్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేశారు. అప్పటి నుండి అతను అభ్యంతరక పోస్టులు పెట్టాడు. అంతేకాదు వేర్వేరు ఫోన్ నెంబర్ల నుంచి ఆమెకు ఫోన్ చేసేవాడు.

బాధితురాలైన ప్రొఫెసర్ కాచిగూడకు చెందినవారు. ఆమె పదేళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. మహిళల రాజకీయ సాధికారత కోసం పని చేస్తున్నారు. కాగా, నిందితుడి అరెస్టుకు పోలీసులకు కొంత సమయం తీసుకుంటుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Woman harassed by facebook friend in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X