కాబోయే భర్తకు టెస్ట్: దాడికి యువతి ప్లాన్, పెళ్లి

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి తనకు కాబోయే భర్త సాహసానికి పరీక్ష పెట్టింది. అందుకు గాను దొంగతనానికి వ్యూహరచన చేసింది. అందుకు గాను ఆ యువతి ముగ్గురు వ్యక్తులను నియోగించుకుంది.

సికింద్రాబాదులోని మల్కాజిగిరికి చెందిన ఓ మహిళకు కుషాయిగుడాకు చెందిన 26 ఏళ్ల కార్పెంటర్‌తో వివాహం నిశ్చయమైంది. నీతో మాట్లాడాలంటూ ఆమె వారం రోజుల క్రితం ఆ యువకుడిని పిలిచింది. అక్కడికి వచ్చిన ఆ యువకుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి, దోపిడీకీ పాల్పడ్డారు. ఆ సంఘటనపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Woman in Hyderabad plans attack on fiance to test his bravery

పోలీసులు ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. అప్పుడు ఆ యువతి వేసిన పథకం వెల్లడైంది. విచారణలో యువతి ఆ విషయాన్ని అంగీకరించింది. తనకు కాబోయే భర్త సాహసాన్ని పరీక్షించడానికి వారిని తాను ఏర్పాటు చేసుకున్నట్లు, అయితే బెదిరింపులకు మాత్రమే పాల్పడాలని చెప్పినట్లు ఆమె తెలిపింది.

ఆ నాటకీయమైన సంఘటన తర్వాత వారిద్దరు వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ ఆ యువకుడు ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పోలీసులు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+