మరో సంఘటన: భర్తను చంపేసి, రైల్వే ట్రాక్‌పై పడేసి డ్రామా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భర్తను చంపేసిన మరో భార్య సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను చంపిన కేసులో భార్యను, ఆమె సోదరుడిని, ఇద్దరు బావలు హైదరాబాదులోని కాచిగూడ పోలీసులు అరెస్టు చేశారు.

అతన్ని చంపేసి శవాన్ని రైల్వే ట్రాక్‌పై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శవాన్ని రైల్వే ట్రాక్‌పై పడేసిన తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శవాన్ని గుర్తించిన తర్వాత విచారణ

శవాన్ని గుర్తించిన తర్వాత విచారణ

పోలీసులు రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న శవాన్ని పోలీసులు గుర్తించి, భార్యను విచారణకు పిలిచారు. తన బంధువుల సాయంతో తానే తన భర్తను చంపానని ఆమె పోలీసుల ముందు అంగీకరించింది.

స్త్రీల అక్రమ సంబంధాలు: భర్తలను చంపిన భార్యలు వీరే

మద్యం కోసం వేధింపులు...

మద్యం కోసం వేధింపులు...

తాగడానికి డబ్బులు ఇవ్వాలని తననూ పిల్లలను వేధించడంతో తానే హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. కర్ణాటకకు చెందిన దేవల్లి జమున (30) అనే మహిళ కాచిగుడా మేదరబస్తీలో పనిచేస్తున్న దేవల్లి శ్రీనివాస్ అలియాస్ ఎల్లయ్యను వివాహం చేసుకుంది.

మరో ఘటన: ప్రియుడి మోజులో గొంతు కోసి భర్తను చంపిన భార్య

వారు సహకరించారు...

వారు సహకరించారు...

భర్తను చంపడానికి జమునకు ఆమె సోదరుడు దత్త శంకర్ తెలంగ్ (23), ఆమె బావలు రాజుబాబు రావు తెలంగ్ (43), రాజేందర్ కిషన్ తెలంగ్ (31) సహకరించారు. ఈ హత్య నిరుడు జరిగింది.

ఆగస్తులో జమున ఫిర్యాదు..

ఆగస్తులో జమున ఫిర్యాదు..

జమున ఫిర్యాదుతో నిరుడు ఆగస్టు 1వ తేదీన కాచిగుడా పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తు జరిపారు. కేసు దర్యాప్తు చేస్తుండగా అతని శవం హైదరాబాదలోని నింబోలి అడ్డ వంతెన సమీపంలో రైల్వే పోలీసులకు కనిపించింది. చోరీ కేసు కింద అతన్ని గతంలో మలక్‌పేట, రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు తేలిది. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు నిరుడు ఆగస్టు 14వ తేదీన దర్యాప్తు ప్రారంభించనట్లు కాచిగుడా పోలీసు ఇన్‌స్పెక్టర్ కె. సత్యనారాయణ చెప్పారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

జమున 16 ఏళ్ల క్రితం..

జమున 16 ఏళ్ల క్రితం..

నిందితురాలు జమున 16 ఏళ్ల క్రితం కిషన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు, ఆ తర్వాత మూడళ్లకు పని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చినట్లు, కూలీ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మూడేళ్లకు ఆమెకు ఎల్లయ్యతో పరిచయమైంది. దాంతో భర్తను వదిలేసి ఎల్ల వద్దకు వచ్చేసింది. కొన్నాళ్లకు ఎల్లయ్య పనులు చేయడం మానేసి మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని ఆమెను వేధిస్తూ వచ్చాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In yet another incident of wife killing the husband, the Kachiguda police arrested a woman, her brother and two brothers-in-law for plotting and killing the husband.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి